Moviesశ్రీలీల ముద్దిరిపోయిన బెండకాయ్..అప్పుడే అవన్ని బాగా తెలుసట..!!

శ్రీలీల ముద్దిరిపోయిన బెండకాయ్..అప్పుడే అవన్ని బాగా తెలుసట..!!

ఎస్ ఇప్పుడు అందరు ఇదే మాట అంటున్నారు . శ్రీ లీల ముదిరిపోయిన బెండకాయ్ .. వామ్మో అప్పుడే ఇన్ని విషయాలు తెలుసా ..? అంటూ ఆమెను స్వీట్ గానే ట్రోల్ చేస్తున్నారు. మనకు తెలిసిందే పెళ్లి సందడ్ అనే సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ .. ఇప్పటివరకు తెరపై కనిపించింది ఒక్కటంటే ఒక్కటే సినిమా. ఆ సినిమా హిట్ కాలేదు .. యావరేజ్ అని కూడా చెప్పలేం ..ఏదో రాఘవేంద్రరావు దయవల్ల ఫ్రీ పబ్లిసిటీ తెచ్చుకుంది . అయితే ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన శ్రీ లీల హీరోగా నటించిన రోషన్ ఇద్దరు మంచి మార్కులు వేయించుకున్నారు.

 

ఈ సినిమా తర్వాత రోషన్ అడ్రస్ లేకుండా వెళ్ళిపోతే.. హీరోయిన్ గా శ్రీలీల మాత్రం పాన్ ఇండియా సినిమాల్లో అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుంది. మరీ ముఖ్యంగా వయసుతో సంబంధం లేకుండా ముదురు హీరోలతో సైతం రొమాన్స్ చేయడానికి సిద్ధపడిన శ్రీలీల ఇలా వయసు లో తనకంటే చాలా పెద్ద వాడైన మాస్ మహారాజు రవితేజ తో ధమాకా సినిమాలో హద్దుల మీరు రొమాన్స్ చేసి సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి గురి అయింది.

అంతేకాదు రీసెంట్గా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న శ్రీ లీల తన బ్యూటీ సీక్రెట్స్ ని అభిమానులతో పంచుకున్నట్లు తెలుసుతుంది. “తను పలు బ్రాండెడ్ ప్రొడక్ట్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నా సరే ..ఇప్పటికీ ఆమె ఫేస్ కి పసుపు – సున్నిపిండి.. తలకి కుంకుడుకాయలు రాసుకుంటుందట . ఎలాంటి కెమికల్ ఉన్న ప్రొడక్ట్స్ వాడదట. అంతేకాదు డైట్ కోసం ఫుడ్ మానేసి కడుపు మాడ్చుకోదట. ఇష్టమైన ఫుడ్స్ అన్ని తింటుందట .

కానీ లిమిట్ గా తిని..వాటర్ ఎక్కువ తాగి..వాకింగ్ చేస్తుందట. అంతేకాదు తన హెల్త్ ఎలా కాపాడుకోవాలో కూడా తనకు తెలుసట . ఎప్పుడు ఎలాంటి సినిమాలు చేయాలో కూడా ఆమెకు పూర్తిగా తెలుసట. ఈ క్రమంలోని ఇప్పటి వరకు ఆమె సైన్ చేసిన సినిమాలన్నీ ఆమె తన సొంత నిర్ణయంతోనే సైన్ చేసిందట . డైరెక్టర్స్ కూడా ముందుగానే బోల్ సీన్స్ ఉంటే డైరెక్ట్ గా చెప్పేస్తారట. ఏది ఏమైనా సరే ఇంత చిన్న ఏజ్ లోనే శ్రీలీల ఇలాంటి పెద్ద డెసిషన్స్ తీసుకుంటుందని తెలిసి ముదిరిపోయిన బెండకాయ్ అని అంటున్నారు జనాలు. చూడాలి మరి ధమాకా సినిమా ఎలాంటి హిట్ ఇస్తుందో..?

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news