Moviesరికార్డులు బ్రేక్ చేసిన బాల‌య్య - ప్ర‌భాస్ షో... ఇంత‌కు మించిన...

రికార్డులు బ్రేక్ చేసిన బాల‌య్య – ప్ర‌భాస్ షో… ఇంత‌కు మించిన అరాచ‌కం ఉందా….!

న‌ట‌సింహం బాల‌కృష్ణ‌, బాహుబ‌లి ప్ర‌భాస్ అన్‌స్టాప‌బుల్ ఎపిసోడ్ ఫ‌స్ట్ పార్ట్ ఒక రోజు ముందుగానే ఆహా ఫ్యాన్స్‌కు అందుబాటులోకి వ‌చ్చేసింది. గ‌త రాత్రి 9 గంట‌ల‌కు ముందుగా చెప్పిన‌ట్టుగానే ఆహాలో స్ట్రీమింగ్ అయ్యింది. అయితే ఒకేసారి కొన్ని ల‌క్ష‌ల మంది ఈ షో చూడాల‌న్న తాప‌త్ర‌యంతో ఆహాను లాగిన్ అవ్వ‌డంతో దెబ్బ‌తో ఆహా స‌ర్వ‌ర్ క్లాష్ అయ్యింది. దాదాపు రెండు గంట‌ల పాటు ఆహా ఓపెన్ అయ్యేందుకు ముప్పు తిప్ప‌లు పెట్టింది.

దీనిని బ‌ట్టే అస‌లు ఈ షోపై సినీ అభిమానులు, ఎంట‌ర్టైన్‌మెంట్ ఫ్యాన్స్‌లో ఎంత ఆతృత ఉందో అర్థ‌మ‌వుతోంది. అయితే ఈ షో రికార్డుల దుమ్ము రేపేసింది. కేవ‌లం 12 గంట‌ల్లో 50 మిలియ‌న్ల మినిట్ల‌ను వాచ్ చేశార‌ని ఆహా అధికారికంగా ప్ర‌క‌టించింది. అస‌లు ఇది ఇండియ‌న్ బుల్లితెర‌, ఓటీటీ చ‌రిత్ర‌లోనే అరుదైన రికార్డుగా నిలిచిపోయింది. ఈ క్రెడిట్ ఖ‌చ్చితంగా బాల‌య్య‌, ప్ర‌భాస్‌కే ద‌క్కింది.

వీరిద్ద‌రి క‌లయిక ఏ రేంజ్‌లో ఉంటుందో ఈ షో ఫ‌స్ట్ ఎపిసోడ్ చెప్ప‌క‌నే చెప్పింది. అటు బాహుబ‌లి లాంటి ప్ర‌భాస్‌కు, న‌ట‌సింహం బాల‌య్య తోడైతే ఇండ‌స్ట్రీ ఎలా ? షేక్ అవుతుందో ఈ ఎపిసోడ్ ఫ్రూవ్ చేసింది. ఈ షో ప్ర‌భాస్‌లోని చాలా కొత్త కోణాల‌ను మ‌న‌కు ప‌రిచ‌యం చేసింది. ప్ర‌భాస్ ప్రేమ‌, పెళ్లి, అల‌వాట్లు, కుటుంబానికి ఇచ్చే విలువ‌, డైట్ ప్లాన్‌, తాను ద‌త్త‌త తీసుకున్న కాజీప‌ల్లి రిజ‌ర్వ్ ఫారెస్ట్ ఇలా చాలా విష‌యాలు చ‌ర్చించాడు. శ‌త్రువులు అయినా కూడా మ‌నుష్యుల‌తో ఎలా? ప్ర‌వ‌ర్తించాలో కృష్ణంరాజు గారు ఎలా ? నేర్పించారో ప్ర‌భాస్ చెప్పాడు.

అస‌లు షోలో చాలా సీన్లు హార్ట్ ట‌చ్చింగ్‌గా ప్ర‌తి ఒక్క‌రి మ‌న‌స్సుల‌ను తాకాయి. అలాగే ఎఫైర్‌, గాసిప్ సంభాష‌ణ భ‌లే న‌వ్వు తెప్పించిందిలే..! ఇక మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చరణ్‌తో చేసిన ఫోన్ కాల్ బెస్ట్. చరణ్ – ప్రభాస్‌ చాలా సన్నిహితంగా ఉన్నారని చాలా మందికి తెలియక‌పోయినా అది ఈ ఎపిసోడ్‌తో తెలిసి వ‌చ్చింది. ఇక త‌న‌కు 43 ఏళ్లు వ‌చ్చినా పెళ్లిపై ఇంకా రాసిపెట్టి లేద‌ని.. పెళ్లి చేసుకుంటాన‌ని.. అయితే ఇప్ప‌ట‌కీ అది త‌న‌కు రాసిపెట్టి లేద‌ని చెప్ప‌డం… తాను ఒంట‌రిగా మిగిలి పోవాల‌ని లేద‌ని చెప్ప‌డం బాగుంది.

రీసెంట్ గా కృతి సనన్ తో ప్రభాస్ డేటింగ్ పుకార్ల‌పై కూడా క్లారిటీ ఇచ్చాడు. తాము మంచి స్నేహితులుం అని.. దీనిపై కృతి కూడా ఇప్ప‌టికే క్లారిటీ ఇచ్చింద‌ని చెప్పాడు. ఏదేమైనా బాల‌య్య‌, ప్ర‌భాస్ అరాచ‌కం అయితే మామూలుగా లేదు. ఈ షో ఇంకెన్ని రికార్డులు బ్రేక్ చేస్తుందో ? చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news