Moviesకత్రినాను టాలీవుడ్ స్టార్ హీరోలు ఆ కార‌ణంతోనే బ్యాన్ చేశారా...?

కత్రినాను టాలీవుడ్ స్టార్ హీరోలు ఆ కార‌ణంతోనే బ్యాన్ చేశారా…?

కత్రినా కైఫ్..ఈ బాలీవుడ్ భామ అంటే ఒకప్పుడు టాలీవుడ్ మేకర్స్‌కి..ప్రేక్షకులకి విపరీతమైన క్రేజ్ ఉండేది. తెలుగులో ఆమె నటించిన మొదటి సినిమా మల్లీశ్వరి. విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన ఈ సినిమా భారీ కమర్షియల్ హిట్ సాధించింది. సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ సినిమా అప్పట్లో ఓ హాట్ టాపిక్. ఎందుకంటే మల్లీశ్వరి సినిమాకి కత్రినా పుచ్చుకున్న రెమ్యునరేషన్. ఆ రోజుల్లోనే ఆమె నిర్మాత‌ల‌ను ఇబ్బంది పెట్టి అనుకున్న దానికంటే కాస్త ఎక్కువుగా.. ఓవ‌రాల్‌గా కోటి రెమ్యున‌రేష‌న్ వ‌సూలు చేసింద‌ని అంటారు.

అక్షరం తెలుగు రానీ ఈ హీరోయిన్ మీద టాలీవుడ్ ప్రేక్షకులు అంతగా ఆసక్తి చూపించలేదు. దీనికి కారణం కత్రినా కైఫ్ హైట్ అని ప్రత్యేకంగా చెప్పాలి. అంత హైట్ ఉన్న హీరోయిన్ సాధారణంగా అందరు హీరోలకి సెట్ అవదు. పైగా మనవాళ్ళకి కాస్తో కూస్తో పర్ఫార్మెన్స్ చేసే హీరోయిన్ కావాలి. అది గనక మొదటి సినిమాలో కనిపించకపోతే అబ్బే అని పెదవి విరుస్తారు.

చాలామంది హీరోయిన్స్ సక్సెస్ కాకపోవడానికి ఉన్న కారణాలలో గ్లామర్..హైట్ అనేది కీలకంగా చూస్తారు. కత్రినాకి కాళ్ళు చాలా పొడవు. దానివల్ల హీరోలకి ఇబ్బంది. తనని తీసుకోవాలంటే అదే మేజర్ ఇబ్బంది. డాన్స్ చేయాలన్నా..రొమాంటిక్ సీన్స్ చేయాలన్నా హైట్ మేనేజ్ చేయడం దర్శకులకి ఇబ్బందే. ఇలా హైట్ ఉన్న హీరోయిన్స్‌లో అనుష్క మన టాలీవుడ్ టాల్ హీరోలకి బాగానే సెట్ అయింది.

కానీ, కత్రినా మాత్రం ఎందుకో ఇక్కడ నిలబడలేకపోయింది. వెంకటేష్, బాలకృష్ణల సరసన నటించిన కత్రినా..ఎక్కువ కామెంట్స్ పడింది మాత్రం బాలయ్య సరసన నటించినప్పుడే. ఈ హైట్ మైనస్ అని మాట్లాడినవారున్నారు. అందుకే, ఈ పొడుగు కాళ్ళ సుందరి తెలుగు ఇండస్ట్రీలో ఇమడలేకపోయింది. పైగా మొదటి సినిమాకి ఏకంగా కోటి రూపాయల రెమ్యునరేషన్ తీసుకోవడం ఇక్కడ సమస్యలు తెచ్చిపెట్టింది.

రెమ్యున‌రేష‌న్ మాత్ర‌మే కాకుండా.. షూటింగ్‌కు లేట్‌గా రావ‌డం… ద‌ర్శ‌కుల‌ను, నిర్మాత‌ల‌ను ఇబ్బంది పెడుతుంద‌న్న ప్ర‌చారం వ‌చ్చేయ‌డంతో ఆమెను త‌మ సినిమాల్లో బుక్ చేసుకునేందుకు టాలీవుడ్ స్టార్ హీరోలు కూడా ఇష్ట‌ప‌డ‌లేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news