Moviesముదురు భామ‌కు ' మెగా ' షాక్ ఇచ్చారుగా... హ్యూమా ఖురేషీకి...

ముదురు భామ‌కు ‘ మెగా ‘ షాక్ ఇచ్చారుగా… హ్యూమా ఖురేషీకి పెద్ద దెబ్బ‌ప‌డిందిగా…!

చాలామంది బాలీవుడ్ హీరోయిన్స్ మన సౌత్ సినిమా ఇండస్ట్రీలకి రావాలని చాలా తాపత్రయపడుతుంటారు. దీనికి కారణం ఇక్కడ వారికొచ్చే మనీబులిటీతో పాటు క్రెడిబులిటీ వేరే లెవల్ అని చెప్పక తప్పదు. అందుకే, సుస్మితా సేన్, రవీనా టాండన్, మనీషా కోయిరాల, టబు, శిల్పాశెట్టి, ప్రీతి జింతా, క‌త్రినాకైఫ్‌ లాంటి స్టార్ హీరోయిన్ ఇక్కడ సినిమా అవకాశాలు వస్తే ఎగిరి గంతేశారు.

ముఖ్యంగా వీరికి తెలుగు ఇండస్ట్రీ అంటే..తెలుగు హీరోలు, దర్శకనిర్మాతలు అంటే చాలా ఆసక్తి, ప్రేమ, అభిమానం చూపిస్తుంటారు. అలా టాలీవుడ్ లేదా..కోలీవుడ్ ఇండస్ట్రీలో ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్నారు యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ నుంచి సీనియర్ హీరోయిన్ సోనాక్షి సిన్హా వరకూ. కానీ, ఇప్పటివరకూ వీరి సౌత్ ఎంట్రీ దొరకలేదు. గతంలో చాలాసార్లు సోనాక్షి సిన్హా తెలుగు తెరకి పరిచయం అవుతుందని వార్తలు వచ్చాయి. అవన్నీ గాలి వార్తలుగానే మిగిలాయి.

అయితే సోనాక్షి కోలీవుడ్ సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ లింగా సినిమాలో న‌టించింది. ఇక గత రెండు మూడేళ్ళుగా అతిలోక సుందరి శ్రీదేవి కూతుళ్ళు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ సౌత్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు ప్రచారం జరిగింది. కానీ, ఎందుకనో ఈ స్టార్ కిడ్స్‌కి ఇక్కడ అవకాశాలు దక్కడం లేదు. కనీసం మేకర్స్ నుంచి పిలుపు కూడా రావడం లేదు. ఇలా సౌత్ పిలుస్తుందని ఎదురుచూసిన మరో స్టార్ హీరోయిన్ హ్యూమా ఖురేషి. అనుకున్నట్టుగానే తమిళ ఇండస్ట్రీలో అవకాశం అందుకుంది.

అది కూడా బాలీవుడ్ మేకర్ బోనీకపూర్ తమిళంలో అజిత్ హీరోగా వలిమై అనే నిర్మించడం వల్లే. అయితే, హ్యూమా అసలు కోరిక టాలీవుడ్‌లో మెగా హీరోలతో సినిమా చేయాలని. నేరుగా టాలీవుడ్ నుంచి ఛాన్స్ రాకపోవడంతో ముందు కోలీవుడ్ అవకాశం వస్తే ఒప్పుకుంది. అయితే, వలిమై తర్వాత మళ్ళీ తమిళంలోనే ఛాన్స్ దక్కలేదు. ఇక తెలుగులో ఎక్కడ వస్తుంది. దీనికి కారణం హ్యూమా కాస్త ముదురు భామగా కనిపిస్తుండటమే. అందుకే, ఇక్కడ ఈ భామని ఎవరూ పట్టించుకోనిది అని టాక్ వినిపిస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news