Moviesఆ మోజులో తప్పు చేస్తున్న సుకుమార్ .. సంకనాకించేస్తున్నాడుగా..!!

ఆ మోజులో తప్పు చేస్తున్న సుకుమార్ .. సంకనాకించేస్తున్నాడుగా..!!

గత ఏడాది డిసెంబర్ 17న రిలీజ్ అయిన పుష్ప సినిమా ఎలాంటి హిట్ అందుకుందో అందరికీ తెలిసిందే . తెలుగు చలనచిత్ర పరిశ్రమలో చెరగని రికార్డును సొంతం చేసుకుంది . అంతేకాదు బన్నీ కెరియర్ లోనే ఎక్కువ కలెక్షన్స్ సాధించిన సినిమాగా రికార్డును నెలకొల్పింది. ఆయనకు పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ ని సంపాదించి పెట్టింది . కేవలం బన్నీకే కాదు డైరెక్టర్ సుకుమార్ , హీరోయిన్ రష్మిక మందన పేర్లు కూడా పాన్ ఇండియా లెవెల్లో మారు మ్రోగిపోయాయి.

అయితే సినిమాలో వీళ్ళందరి పెర్ఫార్మెన్స్ ఒక ఎత్తు అయితే ..సినిమా ఆఖరి టైంలో రిలీజ్ చేసిన పాట మరో సెన్సేషనల్ గా మారింది . టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న సమంత ఫస్ట్ టైం తన కెరీర్లో ఐటమ్ సాంగ్ చేసింది. “ఊ అంటావా మావ ఊ ఊ అంటావా మావ ” అంటూ సెక్సీనెస్ తో మతులు పొగొట్టింది. పలువు స్టార్ సెలబ్రిటీస్ , క్రికెటర్లు కూడా ఈ పాటకు ఓ రేంజ్ లో చిందులేసిన వీడియోస్ ఇప్పటికీ మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం .

కాగా పుష్ప2 లో అంతకుమించి పోయే రేంజ్ లో ఐటెం సాంగ్ ప్లాన్ చేస్తున్నాడు సుకుమార్ అంటూ ఇప్పటికే వార్తలు వినిపించాయి. కాగా రీసెంట్ గా అందుతున్న సమాచారం ప్రకారం పుష్ప2 లో ఐటమ్ సాంగ్ చేయడానికి యాంకర్ అనసూయని ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. మొదటినుంచి అనసూయ అంటే సుకుమార్ కి అదో స్పెషల్ ఇంట్రెస్ట్ అన్న విషయం అందరికీ తెలిసిందే. రంగస్థలం సినిమాలో ఏకంగా లీడ్ పాత్రని ఇచ్చి ఆమె కెరీర్ ని మలుపు తిప్పాడు సుకుమార్.

పుష్ప వన్ లో దాక్షాయిని పాత్ర చేసిన అనసూయను.. క్యారెక్టర్ రోల్ చేస్తూ ఆమెతో ఓ హాట్ అండ్ వైల్డ్ ఐటమ్ సాంగ్ ప్లాన్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది . దీంతో సుకుమార్ పై బన్నీ ఫాన్స్ మండిపడుతున్నారు. బన్నీ రేంజ్ కి అనసూయతో స్టెప్పులా..? సినిమా సంక నాకి పోతది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి చూడాలి సుకుమార్ అనసూయ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news