Moviesబ్రేకింగ్‌: రాజ‌మౌళి - కీర‌వాణి ఇంట్లో తీవ్ర విషాదం

బ్రేకింగ్‌: రాజ‌మౌళి – కీర‌వాణి ఇంట్లో తీవ్ర విషాదం

తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో ఇటీవ‌ల వ‌రుస‌గా విషాదాలో చోటు చేసుకుంటున్నాయి. కొద్ది నెల‌ల వ్య‌వ‌ధిలోనే రెబ‌ల్‌స్టార్ కృష్ణంరాజు, సూప‌ర్‌స్టార్ కృష్ణ‌తో పాటు ఆయ‌న స‌తీమ‌ణి ఇందిరాదేవి మృతిచెందారు. ఇక ఈ యేడాదే కృష్ణ కుటుంబంలో ఆయ‌న పెద్ద కుమారుడు ర‌మేష్‌బాబు కూడా మృతిచెందారు. కొద్ది రోజుల క్రిత‌మే కేజీయ‌ఫ్ న‌టుడు కూడా మృతిచెందారు. ఇలా వ‌రుస‌గా విషాదాలో చోటు చేసుకుంటున్నాయి.

తాజాగా ఈ రోజు టాలీవుడ్ ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి, ఆయ‌న సోద‌రుడు అయిన టాప్ మ్యూజిక్ డైరెక్ట‌ర ఎంఎం. కీర‌వాణి ఇంట్లో విషాదం జ‌రిగింది. రాజ‌మౌళి పిన‌త‌ల్లి, కీర‌వాణికి త‌ల్లి ఈ రోజు మృతిచెందారు. కీర‌వాణి, రాజ‌మౌళి కుటుంబాలు ఉమ్మ‌డి కుటుంబం ఉన్న‌ట్టే ఉంటాయి. ఒక సినిమాలో వీరంద‌రూ క‌లిసి ప్యామిలీ ప్యాకేజ్ కింద వ‌ర్క్ చేస్తారు.

విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ స్టోరీ రైట‌ర్‌, రాజ‌మౌళి ద‌ర్శ‌కుడు, కీర‌వాణి మ్యూజిక్ డైరెక్ట‌ర్‌, ఆయ‌న భార్య శ్రీవ‌ల్లి లైన్ ప్రొడ్యుస‌ర్‌, రాజ‌మౌళి భార్య ర‌మ ఫ్యాష‌న్ డిజైన‌ర్‌. ఇక కీర‌వాణి త‌న‌యుడు కాల‌భైర‌వ కూడా మ్యూజిక్ డైరెక్ట‌ర్ అయ్యారు. ఇక కీర‌వాణి మ‌రో కుమారుడు సింహా హీరోగా చేస్తున్నాడు. ఇప్ప‌టికే ప‌లు సినిమాల్లో న‌టించాడు. ఇక కీర‌వాణికి త‌ల్లితో ఎంతో అనుబంధం ఉంది.

కీర‌వాణి సాధించిన విజ‌యాలు చూసి ఆమె ఎంతో మురిసిపోయేవారు. తాను సంగీత ద‌ర్శ‌కుడిగా సాధించిన విజ‌యాలు, త‌న ప్ర‌స్థానంలో ఆమె పాత్ర ఎంతో ఉంద‌ని కీర‌వాణి చెప్పేవారు. ఇక కీరవాణి తల్లి మృతిప‌ట్ల ఇండ‌స్ట్రీ ప్ర‌ముఖులు ప‌లువురు సంతాపం వ్య‌క్తం చేస్తూ కీర‌వాణి కుటుంబానికి ప్ర‌గాడ సానుభూతి తెలుపుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news