Moviesఆ కుర్ర హీరోను ప‌ట్టేసిన స‌మంత‌... విడాకుల త‌ర్వాత మ‌ళ్లీ కొత్త...

ఆ కుర్ర హీరోను ప‌ట్టేసిన స‌మంత‌… విడాకుల త‌ర్వాత మ‌ళ్లీ కొత్త లైఫే…!

టాలీవుడ్‌లో చెన్నై చిన్న‌ది స‌మంత ఓ సెన్షేష‌న‌ల్‌. 2010లో వ‌చ్చిన నాగ‌చైత‌న్య ఏమాయ చేశావే సినిమాతో హీరోయిన్‌గా తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అయిన స‌మంత ఆ త‌ర్వాత ప‌దేళ్ల పాటు వెన‌క్కు తిరిగి చూసుకోలేదు. వ‌రుస‌గా స్టార్ హీరోల‌తో సినిమాలు చేసి సూప‌ర్ హిట్లు కొట్టింది. ఒకానొక టైంలో ఆమె కాల్షీట్లు కూడా ఖాళీలేనంత బిజీగా ఉండేది. ఆ త‌ర్వాత నాగ‌చైత‌న్య‌తో వ‌రుస‌గా సినిమాలు చేసింది.. ప్రేమ ముదిరి పాకాన ప‌డ‌డంతో పెళ్లి చేసుకున్నారు.

పెళ్లి త‌ర్వాత కూడా చైతుతో మ‌జిలీ సినిమా హిట్‌. పెళ్లి త‌ర్వాత కూడా రామ్‌చ‌ర‌ణ్‌తో చేసిన రంగ‌స్థ‌లం సూప‌ర్ హిట్‌. ఆ త‌ర్వాత విడాకుల వ్య‌వ‌హారం తెలిసిందే. విడాకుల త‌ర్వాత కూడా స‌మంత క్రేజ్ అయితే త‌గ్గ‌లేదు. రీసెంట్‌గా వ‌చ్చిన య‌శోద సంచ‌ల‌న విజ‌యం సాధించింది. త్వ‌రలో రిలీజ్ కానున్న గుణ‌శేఖ‌ర్ శాకుంత‌లంపై కూడా మంచి బ‌జ్ ఉంది. ఇక విడాకుల త‌ర్వాత కూడా స‌మంత‌కు కుర్ర హీరోల‌తో క్రేజీ ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి.. ఇదే ఇక్క‌డ విశేషం.

విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో ఖుషి సినిమాలో హీరోయిన్‌గా ఛాన్స్ రావ‌డ‌మే స‌మంత‌కు పెద్ద ల‌క్కీ అనుకుంటే.. ఇప్పుడు ఏకంగా అడ‌వి శేష్‌కు జోడీగా కూడా ఛాన్స్ వ‌చ్చేసింది. శేష్ లేటెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ 2. హిట్ సినిమాకు సీక్వెల్‌గా వ‌చ్చిన హిట్ 2 సూప‌ర్ హిట్ టాక్ వ‌చ్చింది. ఈ హిట్ సీరిస్‌ను ఏడు సీరిస్‌లుగా తీసుకు రావాల‌ని శేష్ ప్లాన్ చేస్తున్నాడు. ఈ ఏడు సినిమాల్లో ఇంకా న‌లుగురు హీరోలు న‌టిస్తార‌ట‌. ఆ హీరోలు ఎవ‌రు అన్న‌ది ప్ర‌స్తుతానికి స‌స్పెన్స్‌గానే ఉంది.

ఈ సీరిస్‌లో భాగంగా వ‌చ్చే చివ‌రి సినిమాలో ఇండియ‌న్ లెవ‌ల్లో ఏడుగురు హీరోలు ఇన్వెస్ట్‌గేష‌న్ చేస్తార‌ట‌. ఇక హిట్ 3 సీరిస్ నుంచి హీరోయిన్‌గా స‌మంత కూడా ఉండ‌బోతోంద‌ట‌. టోట‌ల్‌గా ఈ సీరిస్ సినిమాల్లో ఇన్వెస్ట్‌గేష‌న్ చేసే టీంలో ఆమె మెంబ‌ర్‌గా న‌టిస్తుంద‌ట‌. స‌మంత‌కు ఈ ఏజ్లో ఖ‌చ్చితంగా ఇది ల‌క్కీ ఆఫ‌రే అని చెప్పాలి. ఆల్రెడీ య‌శోద సినిమాలో స‌మంత లేడీ పోలీస్ ఆఫీస‌ర్‌గా అద్భుతంగా న‌టించి మెప్పించింది.

మ‌రి హిట్ సీరిస్‌లో కూడా ఆమె న‌టిస్తే ఖ‌చ్చితంగా అది ఆ సీరిస్ సినిమాల‌కు క్రేజ్ తీసుకు వ‌స్తుంది. ఏదేమైనా విడాకుల త‌ర్వాత కూడా స‌మంత‌కు కుర్ర క్రేజీ హీరోలు, క్రేజీ ఆఫ‌ర్లు వ‌స్తుండ‌డం నిజంగా ఆమె రీ ఎంట్రీకి కొత్త ఉత్సాహం ఇచ్చేదే..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news