Moviesహిట్ 2 హీరోయిన్ ' మీనాక్షి చౌద‌రి ' గుంటూరు అమ్మాయా......

హిట్ 2 హీరోయిన్ ‘ మీనాక్షి చౌద‌రి ‘ గుంటూరు అమ్మాయా… ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఏంటి…?

టాలీవుడ్‌లో తెలుగు అమ్మాయిలు హీరోయిన్‌గా నిల‌దొక్కుకోవాలంటే పెద్ద త‌పస్సు చేయాల్సిందే. ఎంత క‌ష్ట‌ప‌డుతున్నా.. త‌మ ప‌రిధికి మించి అందాలు ఆర‌బోస్తున్నా వీరికి మాత్రం ఛాన్సులు రావ‌డం లేదు. ఇంకా చెప్పాలంటే వీరికి ఛాన్సులు ఇచ్చేందుకు మ‌న టాలీవుడ్ జ‌నాలు ముందుకు రావ‌డం లేదు. కోట్ల‌కు కోట్లు రెమ్యున‌రేష‌న్లు ఇచ్చి బాలీవుడ్ తెల్ల భామ‌ల‌ను దిగుమ‌తి చేసుకుంటున్నారే త‌ప్పా మ‌న తెలుగు టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేయ‌డం లేదు.

అంజ‌లి, ఈషా రెబ్బా, శోభిత ధూళిపాళ్ల లాంటి హీరోయిన్ల‌కు ఎంత టాలెంట్ ఉన్నా.. ఎన్ని అందాలు చూపించినా ప‌ట్టించుకోరు. ఇదిలా ఉంటే మీనాక్షి చౌద‌రి ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ భామ‌. ఆమె పేరు చౌద‌రి చూసిన కొంద‌రు ఆమె ఆంధ్రాలోని గుంటూరు అమ్మాయి అని.. ఆమె పేరు చివ‌ర చౌద‌రి అని ఉండ‌డంతో ఆమె ఆ కులానికి చెందిన గుంటూరు అమ్మాయ‌ని సోష‌ల్ మీడియాలో చ‌ర్చించుకోవ‌డంతో పాటు కొంద‌రు డౌట్లు కూడా వ్య‌క్తం చేస్తున్నారు.

అయితే ఆమె తెలుగు అమ్మాయి కానే కాదు.. ఆమె బాలీవుడ్ నుంచి టాలీవుడ్‌కు దిగుమ‌తి అయిన ప‌డుచే. మీనాక్షి సొంత రాష్ట్రం హ‌ర్యానా.. ఆమె జాట్ కులానికి చెందిన అమ్మాయి. నార్త్‌లో జాట్స్ ను చౌద‌రీస్ అంటారు. మీనాక్షి వ‌య‌స్సు 26 ఏళ్లు..! తొలి సినిమా ఇచ్చట వాహనములు నిలుపరాదు స‌రిగా ఆడ‌క‌పోవ‌డంతో ఆమె ఎవ్వ‌రి కంట్లో ప‌డ‌లేదు. అయితే రవితేజ ఖిలాడీ సినిమా స‌రిగా ఆడ‌క‌పోయినా ఆ సినిమాలో ఆమె హాట్ అందాలు చూసిన వారు ఎట్రాక్ష‌న్ అయ్యారు.

తాజాగా వ‌చ్చిన అడ‌వి శేష్ హిట్ 2 సినిమా సూప‌ర్ హిట్ అవ్వ‌డంతో ఇప్పుడు అంద‌రి దృష్టి ఆమె మీదే ప‌డింది. అయితే మీనాక్షికి పెద్ద బ్యాక్‌గ్రౌండ్ ఉంది. ఆమెకు మిస్ ఇండియా కిరీటం.. డెంట‌ల్ స‌ర్జ‌న్‌, స్విమ్మింగ్‌, బ్యాడ్మింట‌న్‌లో ప‌త‌కాలు ఇటు సినిమాలు అద‌న‌పు స‌ర‌దా..! సినిమాల్లోకి స‌ర‌దాగా వ‌చ్చినా ఇప్పుడు దానినే కెరీర్‌గా మ‌లుచుకుంది. కుర్ర హీరోలు కూడా ఇప్పుడు మీనాక్షిని త‌మ సినిమాల్లో బుక్ చేయాల‌ని ప‌ట్టుబ‌ట్టే వ‌ర‌కు వ‌చ్చేసింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news