Moviesధ‌మాకా ట్రైల‌ర్‌తో చ‌ర‌ణ్‌, తార‌క్‌, బ‌న్నీపై సెటైర్లు... ఈ ముగ్గురు హీరోల...

ధ‌మాకా ట్రైల‌ర్‌తో చ‌ర‌ణ్‌, తార‌క్‌, బ‌న్నీపై సెటైర్లు… ఈ ముగ్గురు హీరోల ఫ్యాన్స్ ఫైర్‌…!

మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ ధ‌మాకా ట్రైల‌ర్ వ‌చ్చేసింది. ట్రైల‌ర్ అయితే మంచి ఫ‌వ‌ర్ ఫుల్ మాస్ ప్యాకెడ్ అన్న టాక్ వ‌చ్చేసింది. ర‌వితేజ ఎనర్జీ డైలాగులు, డ్యాన్సులు, అన్నింటికి మించి శ్రీలీల అందాలు, ఆమె ముద్దు ముద్దు మాట‌లు, క్యూట్ ఎక్స్‌ప్రెష‌న్స్‌, ర‌వితేజ రెండు పాత్ర‌లు డిఫ‌రెంట్ వేరియేష‌న్స్‌తో ఉండ‌డం.. డైరెక్ట‌ర్ న‌క్కిన త్రినాథ‌రావు టేకింగ్‌, ర‌చ‌యిత బెజ‌వాడ ప్ర‌స‌న్న‌కుమార్ మాట‌లు ట్రైల‌ర్‌ను ఓ ఊపు ఊపేశాయి.

నిజంగా సినిమా చూసినంత హ్యాపీనెస్ వ‌చ్చేసింది. ర‌వితేజ‌కు చాలా రోజుల త‌ర్వాత హిట్ రాబోతోంద‌న్న అంచ‌నాలు ట్రైల‌ర్ చూశాక వ‌చ్చేశాయి. అయితే ఈ ట్రైల‌ర్‌లో ఓ డైలాగ్ మాత్రం ఇప్పుడు కాంట్ర‌వ‌ర్సీకి దారితీస్తోంది. దీంతో స్టార్ హీరోలు ఎన్టీఆర్‌, బ‌న్నీ, చెర్రీ ఫ్యాన్స్ ఇప్పుడు ర‌వితేజ కావాల‌నే ఆ డైలాగ్‌తో త‌మ హీరోల‌ను టార్గెట్ చేశాడంటూ మండిప‌డుతున్నారు.

నేను వెన‌కున్న వాళ్ల‌ను చూసి ముందుకొచ్చినోడిని కాదురోయ్‌.. వెన‌క ఎవ‌డు లేక‌పోయినా ముందుకు రావొచ్చు.. అని ఎగ్జాంపుల్ సెట్ చేసిన వాడిని అన్న డైలాగ్ ర‌వితేజ చెపుతాడు. అంటే టాలీవుడ్‌లో బ్యాక్‌గ్రౌండ్ ఉన్న స్టార్ హీరోల‌ను టార్గెట్ చేస్తూ కావాల‌నే ఈడైలాగ్ వ‌దిలాడ‌న్న కాంట్ర‌వ‌ర్సీని ఇప్పుడు పై ముగ్గురు హీరోల అభిమానులు సోష‌ల్ మీడియాలో స్టార్ట్ చేశారు.

ర‌వితేజ‌కు ఆరేడు సినిమాలు చేస్తే కాని ఒక్క హిట్ రావ‌డం లేదు. ఈ యేడాది ఇప్ప‌టికే రెండు ప్లాపులు కొట్టాడు. ఇంత ఓవ‌ర్ అవ‌స‌ర‌మా ? అన్న విమ‌ర్శ‌లు కూడా ఆ హీరోల అభిమానుల నుంచి వ‌స్తున్నాయి. మ‌రి ఈ కాంట్ర‌వ‌ర్సీ ఈ సినిమాపై ఎలాంటి ప్ర‌భావం చూపిస్తుందో ? చూడాలి. ఇక ఓవ‌రాల్‌గా ట్రైల‌ర్లో మిగిలిన డైలాగులు బాగున్నాయి.

కోట్ల‌లో ఒక‌డు ఆడు కోడితే కోలుకోలేరు – ఒక‌లు నా ఫ్రెండ్ వాళ్ల అన్న‌య్య స్వామి.. ఇంకొక‌లు నాన్న వాళ్ల ఫ్రెండ్ ఆనంద్ చ‌క్ర‌వ‌ర్తి అంటే నీకు ఇద్ద‌రు న‌చ్చారా అంటే ఆ అన‌డం.. – మ‌న‌కు కావాల్సిన వాళ్ల‌కు చేస్తే మోసం.. మ‌న‌కు కావాలి అనుకునే వాళ్ల‌కు చేస్తే న్యాయం.. త్రివిక్ర‌మ్ మీ చుట్ట‌మా సార్ ఈ డైలాగులు అన్నీ సూప‌ర్బ్‌గా ఉన్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news