Moviesఅందరి ముందే రవితేజ కాళ్ల పై పడ్డ పవన్ డైరెక్టర్.. అంత...

అందరి ముందే రవితేజ కాళ్ల పై పడ్డ పవన్ డైరెక్టర్.. అంత తప్పు చేసాడా..?

టాలీవుడ్ మాస్ మహారాజ రవితేజ రీసెంట్గా నటించిన సినిమా ధమాకా . త్రినాధరావు నక్కిన డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్గా నటించింది. గత కొంత కాలంగా వరుస డిజాస్టర్లు అందుకుంటున్న రవితేజకు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ దక్కించుకున్నాడు. కెవలం ఆరు రోజుల్లోనే 60 కోట్లి సాధించిన ఘనత ఈ సినిమా దక్కించుకుంది . కాగా ఈ సినిమా ఇంతటి హ్యూజ్ సక్సెస్ సాధించడంతో సినిమా సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది చిత్ర బృందం.

ఈ సెలబ్రేషన్స్ లో పవన్ కళ్యాణ్ లక్కి డైరెక్టర్ హరిష్ శంకర్ కూడా పాల్గొన్నారు. ఈ సక్సెస్ సెలబ్రేషన్స్ లో హరీష్ శంకర్ మాట్లాడుతూ..” రవితేజను ఓ రేంజ్ లో పొగిడేసారు . నేను అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నప్పటి నుంచి రవితేజ అన్నయ్య నాకు తెలుసని.. చాలా మంచి మనసు ఉన్న వ్యక్తి అని.. ఆయన ధమాకా సినిమా హిట్ అవ్వడం నాకు ఎంతో హ్యాపీనెస్ ఇస్తుంది అని.. చెప్పుకొచ్చారు”.

అంతేకాదు “తన మొదటి సినిమా షాక్ ఫ్లాప్ అయినా సరే .. నాకు రెండు సినిమా మిరపకాయ అవకాశం ఇచ్చి ..తన పేరుని జనాలకు తెలియజేసేలా చేశారని.. ఆయన రుణం నేనెప్పటికీ తీర్చుకోలేనని చెప్తూ ..అందరి ముందే ఆయన కాళ్ళకు నమస్కరించాడు ..”. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉండే వాళ్ళు షాక్ అయిపోయారు . రవితేజ ఇంత గొప్ప మనసు ఉన్న వ్యక్తి నా అంటూ ఆశ్చర్య పోతున్నారు. ప్రజెంట్ ఇదే వీడియోని ట్రెండ్ చేస్తున్నారు రవితేజ ఫ్యాన్స్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news