Movies' 18 పేజెస్ ' ప్రీమియ‌ర్ షో టాక్‌... నిఖిల్ మ‌ళ్లీ...

‘ 18 పేజెస్ ‘ ప్రీమియ‌ర్ షో టాక్‌… నిఖిల్ మ‌ళ్లీ హిట్ కొట్టాడా…. లేదా ?

కార్తీకేయ 2 సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారాడు నిఖిల్‌. కార్తీకేయ 2 ఎలాంటి అంచ‌నాలు లేకుండానే పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయ్యింది. కార్తీకేయ 2 పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ అవ్వ‌డంతో పాటు నిఖిల్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. అదే ఊపులో ఇప్పుడు త‌క్కువ టైంలోనే 18 పేజెస్ అంటూ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఇదో ప్రేమ‌క‌థా సినిమా.

వ‌రుస హిట్ సినిమాలు నిర్మిస్తోన్న జీఏ 2 పిక్చ‌ర్స్‌, సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ హీరోయిన్‌గా న‌టించిన ఈ సినిమాకు అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌కుడు కాగా, బ‌న్నీ వాస్ నిర్మాత‌. ఇప్ప‌టికే రిలీజ్ అయిన టీజ‌ర్‌, ట్రైల‌ర్‌, పాట‌ల‌కు అదిరిపోయే రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ సినిమాకు ప్ర‌మోష‌న్లు కూడా భారీ ఎత్తున చేశారు.

భారీ అంచ‌నాల మ‌ధ్య ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ సినిమా ప్రీమియ‌ర్లు ఇప్ప‌టికే ప‌డిపోయాయి. సినిమా చూసిన ప‌లువురు నెటిజ‌న్లు సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌మ స్పంద‌న తెలియ‌జేస్తున్నారు. సినిమాలో మంచి కథను ఉంది… మంచి ఫీల్ గుడ్ మూవీగా ఉండవచ్చు. అయితే, సినిమాలోని కొన్నీ సీన్లు సినిమా రేంజ్‌ను త‌గ్గించాయ‌ని అంటున్నారు. ఓవ‌రాల్‌గా 18 పేజెస్ రొమాంటిక్ ఎంట‌ర్టైన్‌మెంట్‌గా నిలిచింద‌ని.. సుకుమార్ టీం వ‌ర్క్ బాగుంద‌ని మ‌రి కొంద‌రు అంటున్నారు.

సినిమా ల‌వ్‌స్టోరీ అయినా.. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ బాగున్నాయ‌ని.. నిఖిల్ – అనుపమ ప‌ర‌మేశ్వ‌ర‌న్ మ‌ధ్య రొమాంటిక్ సీన్లు కూడా సూప‌ర్బ్ అని అంటున్నారు. అలాగే స్క్రీన్ ప్లే డిఫ‌రెంట్‌గా ఉంద‌ని.. సుకుమార్ మార్క్ క‌నిపిస్తుంద‌ని మ‌రి కొంద‌రు నెటిజ‌న్లు అంటున్నారు. ఓవ‌రాల్‌గా నిఖిల్ సినిమాకు మంచి టాక్ వ‌చ్చింది. మ‌రి పూర్తి రివ్యూతో త్వ‌ర‌లోనే క‌లుసుకుందాం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news