Moviesఇండస్ట్రీలో ఒక్క మగాడు ఆయనే.. తెలుగు హీరోలకి మండిస్తున్న నయనతార మాటలు..!!

ఇండస్ట్రీలో ఒక్క మగాడు ఆయనే.. తెలుగు హీరోలకి మండిస్తున్న నయనతార మాటలు..!!

సౌత్ ఇండియాలో హీరోయిన్ నయనతార కు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు . ఎంతమంది హీరోలు ఉన్నా సరే వాళ్లకి సరి సమానంగా ఏ విషయంలో తగ్గేదేలే అన్న రీతిలో నయనతార కంటెంట్ ఉన్న సినిమాలను చూస్ చేసుకొని.. బోల్డ్ పాత్రలోనూ ..భయపెట్టే పాత్రలోను నటిస్తూ నెంబర్ వన్ హీరోయిన్ గా రాజ్యమేలుతుంది. నయన్ రీసెంట్ గా నటించిన సినిమా కనెక్ట్ . ఇది ఓ హారర్ సినిమా .

ఇప్పటివరకు తన సినిమాకి ప్రమోట్ చేయని నయనతార ఫస్ట్ టైం కనెక్ట్ సినిమా కోసం ప్రమోషన్స్ లో పాల్గోనింది. దానికి మెయిన్ రీజన్ ఈ సినిమా తన భర్త బ్యానర్ లో తెరకెక్కుతూ ఉండడమే . ఈ క్రమంలోనే టాలీవుడ్ నందమూరి నట వారసుడు తారక్ గురించి నయనతార మాట్లాడుతూ..ఓ రేంజ్ లో పొగిడేసింది . కాగా తారక్ నటన గురించి అందరూ చెప్పేదే.. కానీ నయనతార చెప్పిన కామెంట్స్ వింటే నందమూరి ఫ్యాన్స్ కు పూనకాలు రావాల్సిందే .

డ్యాన్స్ చేసేటప్పుడు ఒక్కసారి కూడా రిహాసిల్స్ తీసుకోడని.. డైరెక్ట్ గా షాట్ కి వెళ్లి పోతాడని..గాల్లో ఎగిరే స్టెప్స్ కూడా అవలీలగా చేసేస్తాడని,, కొరియోగ్రాఫర్ స్టెప్ చెప్పేటప్పుడే కళ్లతోనే అర్థం చేసుకునేస్తాడని.. ఆ టైంలో మాకు టెన్షన్ వచ్చేస్తుందని ..మాకు రిహార్సస్ కావాలి.. కానీ తారక్ కి ఆ అవసరం లేదు ..తారక్ తో పోటీపడి మేము చేయడానికి ట్రై చేసేవాళ్ళం ..కానీ ఎప్పుడు మేము తారక్ తో గెలవలేకపోయాం. అదుర్స్ సినిమాలో ఒక్కొక్క స్టెప్స్ వేస్తున్నప్పుడు నా మైండ్ బ్లాక్ అయిపోయింది . ఇప్పటివరకు నేను అలా తారక్ లాగా డాన్స్ చేసే వారిని చూడలేదు అంటూ ఓపెన్ గానే చెప్పుకొచ్చేసింది . నయనతార తారక్ గురించి మాత్రమే ఇలా చెప్పడం కొందరు ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నా.. నందమూరి ఫ్యాన్స్ మాత్రం ఫుల్ జోష్ లో ఎంజాయ్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news