Moviesమళ్లీ జబర్ధస్త్ లోకి మినిస్టర్ రోజా.. షోకి ప్లసా..మైనసా..?

మళ్లీ జబర్ధస్త్ లోకి మినిస్టర్ రోజా.. షోకి ప్లసా..మైనసా..?

బుల్లితెరపై జబర్దస్త్ షోకు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు . ఎంతోమంది కమెడియన్స్ ని స్టార్ గా మార్చిన షో గా బాగా పాపులారిటీ దక్కించుకుంది. వాళల్కి ఏ విధంగా హెల్ప్ చేసిందో అందరికి తెలిసిందే. కేవలం స్టార్స్ కే కాదు సీనియర్ సెలబ్రిటీస్ సైతం లైఫ్ లో మరో స్టెప్ వేసే ఛాన్స్ ఇచ్చింది . అలాంటి వారిలో ఒకరే సీనియర్ హీరోయిన్ రోజా.

ఎలాంటి పొజిషన్లో రోజా జబర్దస్త్ లో జడ్జిగా ఒప్పుకున్నారో అందరికీ తెలిసిందే. అప్పట్లో పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయిన రోజా.. జబర్దస్త్ జడ్జిగా చేసిన తరువాత కొంచెం సెటిల్ అయ్యింది. కాగా దాదాపు 9 సంవత్సరాలు షో కి జడ్జీగా వ్యవహరించిన రోజా.. మినిస్టర్ పదవి రావడంతో పూర్తిగా ప్రజలకు సేవ చేయాలన్న కారణంతో జబర్దస్త్ కి గుడ్ బాయ్ చెప్పేసింది అయితే ఎవరు ఊహించిన విధంగా మళ్లీ జబర్దస్త్ షోపై దర్శనం ఇచ్చింది రోజా రీసెంట్ గా దీనికి సంబంధించిన ప్రోమోన్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది మల్లి మాల ఈ క్రమంలోనే చెప్పేసింది.

కాగా రీసెంట్ గా జబర్దస్త్ షో స్టార్ట్ అయిన 500వ ఎపిసోడ్ కి రోజా స్పెషల్ గెస్ట్ గా హాజరైంది. ఈ క్రమంలోనే షోలో జడ్జిగా వ్యవహరిస్తున్న కృష్ణ భగవాన్ , ఇంద్రజాలు ఆమెను చూసి సర్ప్రైజ్ అయ్యారు. కమెడియన్స్ కూడా ఆమెకు స్పెషల్ వెల్కమ్ ఇచ్చారు. ఇక తనదైన స్టైల్ లో పంచు లతో దూసుకుపోయింది రోజా. అంతేకాదు ఆఖరిలో ఆమె జబర్దస్త్ గురించి చెప్పిన మాటలు ప్రోమోకే హైలెట్గా మారాయి .

“నాతో పాటు వచ్చిన హీరోయిన్స్ అందరినీ జనాలు మర్చిపోయారు . కానీ నన్ను మాత్రం గుర్తు పెట్టుకున్నారు . అంటే దానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ జబర్దస్త్ “అంటూ చెప్పుకొచ్చింది. అయితే జబర్దస్త్ స్టేజీ పై రీ ఎంట్రీ ఇవ్వడంపై కొందరు నెగిటివ్గా స్పందిస్తున్నారు. మళ్ళీ ఆ బూతు పదాలు వినాల్సి వస్తుంది అంటూ మండిపడుతున్నారు . దీంతో రోజా షో కి రావడం మైనస్ గా మారింది అంటూ చెప్పుకొస్తున్నారు. మరి మీరేమంటారు రోజా మళ్లీ జబర్దస్త్ లోకి రావడం షోకి ప్లసా అంటారా..? మైనస్ అంటారా..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news