Moviesఅందం కోసం బిగ్గెస్ట్ రిస్క్.. ఎవ్వరు ఊహించని డేరింగ్ పని...

అందం కోసం బిగ్గెస్ట్ రిస్క్.. ఎవ్వరు ఊహించని డేరింగ్ పని చేసిన మెహ్రీన్..!!

సినిమా ఇండస్ట్రీలో అందంగా ఉండడం చాలా ఇంపార్టెంట్. హీరోల పరిస్థితి ఎలా ఉన్నా సరే.. హీరోయిన్స్ మాత్రం అందంగా లేకపోతే అస్సలు జనాలు పట్టించుకోరు . జనాలు పట్టించుకోని ముద్దుగుమ్మల కోసం డైరెక్టర్ , ప్రొడ్యూసర్స్ పాకులాడరు. అందుకే సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా రావాలంటే నటన కన్నా ముందు అందంగా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటారు అమ్మాయిలు . ఈ క్రమంలోని ఇండస్ట్రీలో ఉండే ముద్దుగుమ్మలు రకరకాల డైట్ లు ఫాలో అవుతూ నాచురల్ గా అందంగా కనిపించడానికి డిఫరెంట్ మెథడ్స్ ని ఫాలో అవుతూ ఉంటారు ,

అయితే సహజ సిద్ధంగానే అందంగా ఉండే ఈ పంజాబీ బ్యూటీ మెహ్రీన్ తన అందాన్ని మరింత పెంచుకోవడానికి చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మనకు తెలిసిందే పంజాబీ ముద్దుగుమ్మ మెహ్రీన్ కృష్ణగాడి వీర ప్రేమ గాధ అనే సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు పరిచయమైంది. ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఈ ముద్దుగుమ్మ,,ఆ తరువాత తనదైన స్టైల్ లో సినిమాల్లో అవకాశాలు అందుకుంటూ హిట్లు ఫ్లాపులు అని తేడా లేకుండా మంచి మంచి రోల్స్ అందుకుని తనదైన స్టైల్ లో మెప్పించింది.

సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గా ఉండే మెహ్రిన్ రీసెంట్గా ఒక షాకింగ్ ఫోటోను షేర్ చేసింది . తన అందమైన ముఖానికి సూదులతో గుచ్చుకుని..కనిపించింది. ఈ ఫోటోలో తన అందమైన ముఖానికి సూదులతో గుచ్చినట్లు కనిపిస్తుంది . కాగా ఇదే ఫోటో కింద ఆమె రాసుకొస్తూ..” సూదులతో మ్యాజిక్ నా ముఖం కోసం అకుస్ కిన్ లిఫ్ట్ పద్ధతిని ఉపయోగించినందుకు సాగరిస్తూ కి స్పెషల్ థాంక్స్ ..త్వరలోనే దుబాయ్ లేదా లండన్ లో మిమ్మల్ని కలుస్తాను” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. దీనిబట్టి మెహ్రీన్ ఇంకా అందంగా మారడానికి తన ఫేస్ పై కొత్త విధాలను ప్రొసీడ్ అవుతుంది అంటూ తెలుస్తుంది . ఏది ఏమైనా సరే ఇలాంటి ప్రాసెస్ ఫాలో అయ్యేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.. ఏమాత్రం తేడా కొట్టిన ముఖం ఎలా మారిపోతుందో ఎవ్వరు చెప్పలేరు. ఇలాంటి ప్రాసెస్ కు అంగీకరించి మెహ్రీన్ బిగ్గెస్ట్ రిస్క్ చేసింది అంటున్నారు ఫ్యాన్స్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news