Moviesఆ హీరోయిన్‌ను ఎందుకు పెట్టారు... సినిమా ప్లాప్ అన్న మ‌హేష్‌... క‌ట్...

ఆ హీరోయిన్‌ను ఎందుకు పెట్టారు… సినిమా ప్లాప్ అన్న మ‌హేష్‌… క‌ట్ చేస్తే బ్లాక్‌బ‌స్ట‌ర్‌..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‌ను ఒక్కసారిగా మార్చిన సినిమా ఒక్కడు. 2003 సంక్రాంతి కానుకగా జనవరి 15న రిలీజ్ అయిన ఈ సినిమా… అప్పట్లో ఎన్టీఆర్ నాగ సినిమాకు పోటీగా వచ్చింది. అప్పటికే ఎన్టీఆర్ ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. స్టూడెంట్ నెంబర్ 1 – ఆది లాంటి బ్లాక్ బస్టర్లతో దూసుకుపోతున్నాడు. అప్పట్లో శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ నుంచి సినిమా వస్తుందంటే మామూలు అంచనాలు ఉండేవి కావు. అలా సూర్య మూవీస్ బ్యానర్ లో ఎన్టీఆర్ హీరోగా నాగ సినిమా తెరకెక్కింది.

అదే సంక్రాంతికి ఎలాంటి అంచనాలు లేకుండా ఒక్క‌డు వ‌చ్చింది. సుమంత్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్లో ఎమ్మెస్ రాజు ఒక్కడు సినిమా నిర్మించారు. గుణశేఖర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు ముందు మహేష్ కు వరుసగా అన్ని ప్లాప్ సినిమాలు పడ్డాయి. రెండు నెలల ముందు రిలీజ్ అయిన బాబి అయితే మహేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్. ఒకవైపు నాగ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మహేష్ ఒక్కడిపై ముందుగా ఎలాంటి అంచనాలు లేవు.

ఈ సినిమాలో మహేష్‌కు జోడిగా భూమిక నటించింది. 2001 ఆగస్టులో ఈ సినిమా షూటింగ్ ప్రారంభోత్సవం జరుపుకుంది.. యేడాదిన్నర పాటు సుదీర్ఘంగా షూటింగ్ జరుపుకున్న ఒక్కడు ఎట్టకేలకు 2003 సంక్రాంతికి రిలీజ్ అయింది. సినిమా హిట్ అవుతుందన్న నమ్మకాలు చాలామందికి లేవు. పైగా గుణశేఖర్ చిరంజీవితో అప్పటికే మృగరాజు లాంటి డిజాస్టర్ సినిమా తెరకెక్కించి ఉన్నారు. అసలు మహేష్.. గుణశేఖర్‌కు ఎందుకు ఛాన్స్ ఇచ్చాడా అని మహేష్ అభిమానులు సైతం తలలు పట్టుకున్నారు.

అయితే అంద‌రి అంచ‌నాలు త‌ల్ల‌కిందులు చేస్తూ సినిమా సూప‌ర్ హిట్ అయ్యింది. ఏకంగా 130 కేంద్రాల్లో 100 రోజులు ఆడేసింది. అయితే సినిమా షూటింగ్ మ‌ధ్య‌లో భూమిక‌కు చికెన్ పాక్స్ ( పొంగు) వ‌చ్చింది. ఆమె ఫేస్ అంతా పాడైపోయింది. ఖుషీ సినిమా టైంలో భూమిక ఫేస్‌లో ఉన్న ఛరిష్మా అంతా పోయింది. ఆమె ఫేస్‌పై మ‌చ్చ‌లు వ‌చ్చేశాయి. దీంతో ఈ సినిమాను మ‌ధ్య‌లో కొన్ని నెల‌ల పాటు ఆపేశారు. మ‌హేష్ బాబితో పాటు ట‌క్కరిదొంగ సినిమాలు పూర్తి చేశాడు.

Watch Okkadu | Prime Video

అస‌లు చివ‌ర‌కు మ‌హేష్‌కు సైతం ఈ సినిమా పూర్త‌వుతుందా ? అన్న న‌మ్మ‌కం లేదు. అస‌లు భూమిక‌ను హీరోయిన్‌గా తీసుకుని త‌ప్పు చేశామా ? అన్న నిర్ణ‌యానికి కూడా మ‌హేష్ వ‌చ్చేశాడు. మ‌రోవైపు భారీ బ‌డ్జెట్‌. చార్మినార్ సెట్ కూడా రు. 2 కోట్ల‌తో వేశారు. మ‌ధ్య‌లో భూమిక సెట్లోకి వ‌చ్చి షూటింగ్ పూర్త‌య్యి రిలీజ్ అయ్యి బ్లాక్‌బ‌స్ట‌ర్ అయ్యింది. అయితే భూమిక‌కు చికెన్ పాక్స్ వ‌చ్చినా కూడా సినిమాలో ఆమె పాత్ర‌కు త‌గిన‌ట్టుగా ఆమె ఫేస్ ఉంది. ఖుషితో పోలిస్తే ఆమెలో గ్లామ‌ర్ కాస్త త‌గ్గిన‌ట్టు ఉన్నా సినిమాలో ఆమె పాత్ర‌కు త‌గిన‌ట్టుగా త‌యారైంది.

Html code here! Replace this with any non empty raw html code and that's it.

Latest news