Moviesబన్నీ భార్య హీరోయిన్ ఎంట్రీ డేట్ ఫిక్స్ అయిపోయిందోచ్..ఆ స్టార్ హీరో...

బన్నీ భార్య హీరోయిన్ ఎంట్రీ డేట్ ఫిక్స్ అయిపోయిందోచ్..ఆ స్టార్ హీరో సినిమాతోనే..!?

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ కి కొదవలేదు ..బోలెడు మంది ఉన్నారు . హిట్ కొట్టిన హీరోయిన్స్ ..హిట్ కొట్టని హీరోయిన్స్ ..అందాలు ఆరబోస్తూ కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తున్నారు . అయితే మాకు అందాలు ఉన్నాయి .. మేము ఇండస్ట్రీలోకి హీరోయిన్గా వస్తామని పలువురు ముద్దుగుమ్మలు స్టార్ డాటర్లు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారు . తెలుగు భాషలోనే కాదు పక్క భాష నటులు కూడా మన ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి అవకాశాలు అందుకుంటున్నారు . ఈ క్రమంలోనే టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ భార్య సైతం ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇస్తుందన్న న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .

గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో అల్లు స్నేహారెడ్డి ..ఎలాంటి హాట్ ఫోటోషూట్స్ చేస్తుందో అందరికీ తెలిసిందే. ఆఫ్ కోర్స్ హీరోయిన్ కి మించిపోయే అందం ఉన్న స్నేహ రెడ్డి ..హీరోయిన్ అయితే తప్పేంటి అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి . అయితే ఇద్దరు పిల్లలకు తల్లి అయిన స్నేహ రెడ్డి.. హీరోయిన్గా చేయడం ఏంటి.. అది కూడా మేము దేవుడిగా భావించే స్టార్ హీరో భార్య నా నో వే అంటూ అల్లు ఫాన్స్ చెప్పుకొస్తున్నారు . మరి కొంతమంది ఇద్దరు పిల్లలకు తల్లి అయిన హీరోయిన్స్ కూడా ఇండస్ట్రీలో హీరోయిన్గా చేస్తున్నారు .

అలాంటిది అన్ని క్వాలిటీస్ ఉన్నా స్నేహారెడ్డి హీరోయిన్గా చేస్తే ఎంకరేజ్ చేయకపోవడం ఏంటి అంటూ సోషల్ మీడియాలో ఒక పెద్ద వార్ నే జరుగుతుంది . కాగా ఇలాంటి క్రమంలోనే బన్నీ సైతం అల్లు స్నేహారెడ్డి ఇష్టాన్ని గౌరవించి ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎంట్రీ కి రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తుంది . మలయాళ స్టార్ నటుడు పృథ్వీరాజ్ సినిమాలో అల్లు స్నేహారెడ్డి ఇంపార్టెంట్ రోల్ లో నటించబోతున్నట్లు తెలుస్తుంది . అయితే ఈమె హీరోయిన్గా కాదు ట్రెడిషనల్ పాత్రలోనే మేరవనుంది అన్న న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఏది ఏమైనా సరే అల్లు స్నేహారెడ్డి తెరపై కనిపిస్తే అల్లు ఫాన్స్ కు ఏ రేంజ్ పూనకాలు వస్తాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సినిమాని బ్లాక్ బస్టర్ హిట్ చేసి పక్కన పడేస్తారు. అలాంటి ఓ సత్తా ఉంది అల్లు ఫాన్స్ కి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news