Moviesఎన్టీఆర్ -ప్ర‌శాంత్ నీల్ మ‌ల్టీస్టార‌ర్‌లో ఆ స్టార్ హీరోనా... అబ్బా ఏం...

ఎన్టీఆర్ -ప్ర‌శాంత్ నీల్ మ‌ల్టీస్టార‌ర్‌లో ఆ స్టార్ హీరోనా… అబ్బా ఏం కాంబినేష‌న్ రా బాబు..!

కేజీఎఫ్‌, కేజీఎఫ్ 2 సినిమాల‌తో పాన్ ఇండియా డైరెక్ట‌ర్‌గా మారిపోయాడు ప్ర‌శాంత్ నీల్‌. ఈ రెండు సినిమాల దెబ్బ‌తో ప్ర‌శాంత్ నీల్‌కు ఫుల్ డిమాండ్ వ‌చ్చేసింది. ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా ఉన్న స్టార్ హీరోలు అంద‌రూ కూడా ప్ర‌శాంత్ నీల్ డైరెక్ష‌న్‌లో ఒక్క సినిమాలో అయినా న‌టిస్తే త‌మ‌కు పాన్ ఇండియా క్రేజ్ వ‌చ్చేస్తుంద‌న్న కోరిక‌తో ఉన్నారు.

కేజీయ‌ఫ్ 2 త‌ర్వాత ప్ర‌శాంత్ నీల్ యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌తో స‌లార్ సినిమా తెర‌కెక్కిస్తున్నాడు. స‌లార్ భారీ అంచ‌నాల‌తో తెర‌కెక్కుతోంది. వ‌చ్చే యేడాది ఈ సినిమా రిలీజ్ కానుంది. ప్ర‌భాస్‌కు జోడీగా శృతీహాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. స‌లార్ త‌ర్వాత కూడా నీల్ మ‌ళ్లీ తెలుగు హీరో జూనియ‌ర్ ఎన్టీఆర్‌తో సినిమా చేస్తున్నాడు.

ప్ర‌స్తుతం ఎన్టీఆర్ కొర‌టాల శివ‌తో చేస్తోన్న సినిమా కంప్లీట్ అయిన వెంట‌నే ప్ర‌శాంత్ నీల్ సినిమా ఉంటుంది. దీనిపై ఇప్ప‌టికే అధికారిక ప్రక‌ట‌న వ‌చ్చేసింది. నీల్ ఓ వైపు ప్ర‌భాస్ స‌లార్ సినిమా తెర‌కెక్కిస్తూనే ఇటు ఎన్టీఆర్ సినిమా క‌థ‌పై క‌స‌ర‌త్తులు చేస్తున్నాడు. ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ భారీ యాక్షన్ డ్రామా తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడు.

అయితే, ఈ సినిమా పై ఫ్యీజులు ఎగిరిపోయే అప్‌డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇది మ‌ల్టీస్టార‌ర్ సినిమా అట‌. ఈ సినిమాలో సీనియ‌ర్ హీరోకు సెట్ అయ్యే ఓ క్యారెక్ట‌ర్ ఉంద‌ట‌. ఆ పాత్ర‌ను బాలీవుడ్ స్టార్ హీరో అమీర్‌ఖాన్‌తో చేయించాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ట‌. అమీర్ లాంటి న‌టుడు అయితేనే ఆ పాత్ర‌కు పూర్తి న్యాయం చేస్తార‌ని ప్ర‌శాంత్ ఫీల్ అవుతున్నాడ‌ట‌.

ఎన్టీఆర్ – ప్ర‌శాంత్ నీల్ ఇమేజ్‌కు అమీర్ లాంటి న‌టుడు కూడా తోడు అయితే అస‌లు ఆ కాంబినేష‌న్ ఎలా ఉంటుందో ఊహించుకోవ‌డానికే అంద‌డం లేదు. ఏదేమైనా ఈ దెబ్బ‌తో ఎన్టీఆర్ రేంజ్ ఇంట‌ర్నేష‌న‌ల్ లెవ‌ల్లో దూసుకెళ్ల‌డం ఖాయం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news