Moviesమహేశ్ ఈగోని గెలికిన విజయ్ దేవరకొండ..సోషల్ మీడియాలో మరో ఇంట్రెస్టింగ్ వార్...

మహేశ్ ఈగోని గెలికిన విజయ్ దేవరకొండ..సోషల్ మీడియాలో మరో ఇంట్రెస్టింగ్ వార్ ..!?

సినీ ఇండస్ట్రీలో హీరోలు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు . సరదాగా ఒక మాట అనుకున్నా ఇద్దరు సినిమాలు ఒకే డేట్ న రిలీజ్ అవ్వాలన్నా చాలా ఫ్రెండ్లీగా సరదాగా తీసుకుంటూ ఉంటారు .అంతెందుకు ఈ సంక్రాంతికి టాలీవుడ్ లెజెండ్స్ అయినా బాలకృష్ణ – చిరంజీవి బిగ్గెస్ట్ ఫైట్ ఎదురుకోబోతున్నారు . వీర సింహారెడ్డి పేరుతో బాలయ్య ..వాల్తేరు వీరయ్య పేరుతో చిరంజీవి సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

అయితే వీళ్ళ ఇద్దరు చాలా ఫ్రెండ్లీగా మెయింటైన్ చేస్తున్న ఈ రిలేషన్ షిప్ ను కొందరు ఫాన్స్ హద్దులు మీరి కామెంట్స్ చేసి మెగా వ్శ్ నందమూరి ఫ్యాన్స్ అనేంతలా మార్చుకున్నారు .కాగా రీసెంట్గా అలాంటి ఓ వార్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. కాంట్రవర్షల్ కామెంట్స్ కి దూరంగా ఉండే మహేష్ బాబు ఈగోని టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ గెలికాడు అంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. నిజానికి విజయ్ దేవరకొండ తో కంపేర్ చేస్తే మహేష్ బాబు చాలా పెద్ద హీరో ..చాలా సీనియర్ కూడా.

మహేష్ బాబుతో సినిమా ఆఫర్ వస్తే ఎవ్వరూ రిజెక్ట్ చేయరు . కానీ మహేష్ బాబు ఎస్ ఎస్ ఎన్ బి 28 సినిమాలో ఆఫర్ వస్తే గెస్ట్ రోల్ పాత్రలో విజయ్ దేవరకొండను అప్రోచ్ అవ్వగా ..ఆయన నో చెప్పినట్లు క్రేజీ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . అంతేకాదు విజయ్ దేవరకొండ ..మహేష్ సినిమా ని రిజెక్ట్ చేయడం ఆయనకు చాలా బాధ కలిగించిందట . సూపర్ స్టార్ కృష్ణ చనిపోయినప్పుడు, ఇందిరాదేవి చనిపోయినప్పుడు మహేష్ ని దగ్గరుండి పలకరించడం విజయ్ దేవరకొండ.. ఆ టైంలో వీళ్ళ ఇద్దరి పేర్లు సోషల్ మీడియాలో టాప్ రేంజ్ లో ట్రెండ్ అయ్యాయి.

మరి అలాంటిది మహేష్ సినిమాలో గెస్ట్ రోల్ ఛాన్స్ వస్తే విజయ్ దేవరకొండ ఎందుకు రిజెక్ట్ చేశాడు అనేది ప్ర్శ్నార్ధకంగా మారింది. అయితే గెస్ట్ రోల్ పాత్ర చేయడమే ఇష్టం లేక విజయ్ దేవరకొండ ఆఫర్ ని రిజెక్ట్ చేశాడంటూ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. అసలు విజయ్ దేవరకొండ రిజెక్ట్ చేశాడో లేదో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం మహేష్ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ హద్దులు మీరి రెచ్చిపోతున్నారు . మహేష్ సినిమానే రిజెక్ట్ చేసే అంత పెద్ద హీరోవా నువ్వు అంటూ విజయ్ దేవరకొండ ని టార్గెట్ చేస్తుండగా ..మహేష్ అయిన వాళ్ళ నాన్న అయినా ఎవరైనా పాత్ర నచ్చకపోతే విజయ్ దేవరకొండ చేయడు.. అదే ఆయన మేనరిజం అంటూ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు . ఇద్దరు యంగ్ హీరోస్ ఫాన్స్ మధ్య వార్ రావడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

Latest news