Moviesఇంట్రెస్టింగ్: 2022 లోనే అతి పెద్ద డిజాస్టర్ మూవీ ఇదే..ఫ్యాన్స్ ఒప్పుకుంటారా..?

ఇంట్రెస్టింగ్: 2022 లోనే అతి పెద్ద డిజాస్టర్ మూవీ ఇదే..ఫ్యాన్స్ ఒప్పుకుంటారా..?

2022 ఎండింగ్ వచ్చేసింది . మరో ఎనిమిది రోజుల్లో ఈ సంవత్సరానికి ముగింపు పలకబోతున్నాం. కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. కొత్త ఆశలతో సరికొత్త అంచనాలతో ఈ సంవత్సరంలో బాక్స్ ఆఫీస్ వద్ద ఎన్నో సినిమాలు రిలీజ్ అయ్యాయి . కొన్ని సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవ్వగా మరికొన్ని సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి . అయితే 2022 ఎంతో మంది హీరోలకి గుర్తుండిపోయే జ్ఞాపకాలను ఇచ్చినట్లే.. 2022 కొంత మంది స్టార్స్ కు చేదు జ్ఞాపకాలను ఇచ్చింది.

2022 లో బిగ్గెస్ట్ హిట్ సినిమాలు కు సంబంధించిన పిక్స్ అలాగే 2022లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచిన మూవీ పేర్లు సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఈ క్రమంలోనే తెలుగులో 2022లోనే అతిపెద్ద డిజాస్టర్ గా నిలిచిన మూవీగా రాధే శ్యామ్ రికార్డ్ క్రియేట్ చేసింది . మనకు తెలిసిందే దాదాపు 250 కోట్లకు పైగానే భారీ బడ్జెట్లో తెరకెక్కించిన ఈ సినిమా కనీసం 100 కోట్లు కూడా రాబట్ట లేకపోయింది . మరీ ముఖ్యంగా పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉన్నారు జనాలు. కాగా ప్రభాస్ రేంజ్ కి తగ్గ కంటెంట్ లేకపోవడంతో సినిమా డిజాస్టర్ అయింది. పెట్టిన దానికి పావు వంతు కూడా తెచ్చుకోలేకపోయింది .

కాగా ఇదే క్రమంలో రెబల్ ఫ్యాన్స్ మెగాస్టార్ చిరంజీవి – రామ్ చరణ్ కలిసి నటించిన ఆచార్య సినిమాను డిజాస్టర్ గా చెప్పుకొస్తున్నారు/ 2022లో అతిపెద్ద డిజాస్టర్ అంటే ఆచార్య నే అని.. సొంత ఫాన్స్ కూడా ఈ సినిమాను చీకొట్టారని .. అసలు కంటెంట్ లేని సినిమా కోసం ఆ స్థాయిలో ప్రమోషన్స్ పెట్టి హంగామా చేయడం దండగ అని చెప్పుకొస్తున్నారు . ఈ క్రమంలోనే 20222 లో బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీ ఆచార్యానా..? లేక రాధా శ్యామ్ నా..? అంటూ సోషల్ మీడియాలో టఫ్ ఫైట్ నెలకొంది . అయితే చాలామంది రాధా శ్యామ్ డిజాస్టర్ మూవీ గా కామెంట్ చేస్తున్నారు . మరి ముఖ్యంగా 250 కోట్లు బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా.. కనీసం 50 కోట్లు కూడా కలెక్ట్ చేయలేకపోయింది..అంటూ దారుణంగా కామెంట్ చేస్తున్నారు . మరి చూడాలి ఈ విషయాన్ని రెబెల్ ఫాన్స్ ఒప్పుకుంటారో లేదో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news