Moviesఎక్స్‌క్లూజివ్‌: ' వీర‌సింహారెడ్డి ' క‌థ‌, డైలాగ్స్ లీక్‌... బాల‌య్య‌కు అఖండ...

ఎక్స్‌క్లూజివ్‌: ‘ వీర‌సింహారెడ్డి ‘ క‌థ‌, డైలాగ్స్ లీక్‌… బాల‌య్య‌కు అఖండ రేంజ్ బ్లాక్‌బ‌స్ట‌రే..!

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌య్య న‌టిస్తోన్న వీర‌సింహారెడ్డి సినిమా సంక్రాంతి కానుక‌గా థియేట‌ర్ల‌లోకి వ‌స్తోంది. అఖండ లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ త‌ర్వాత బాల‌య్య న‌టిస్తోన్న సినిమా కావ‌డం… ఇటు అన్‌స్టాప‌బుల్ రెండో సీజ‌న్ కూడా సూప‌ర్ హిట్ అవ్వ‌డంతో వీర‌సింహారెడ్డికి బాల‌య్య కెరీర్‌లోనే హ‌య్య‌స్ట్ ప్రి రిలీజ్ బిజినెస్ జ‌రుగుతోంది.

ఇక ఈ సినిమా స్టోరీ, డైలాగులు ఈ సినిమాకు ప‌నిచేసిన వారి స‌ర్కిల్స్ ద్వారా బ‌య‌ట‌కు లీక్ అయ్యాయి. ఇప్ప‌టికే రిలీజ్ అయిన జై బాలయ్య సాంగ్‌, సుగుణ సుంద‌రి సాంగ్స్ అయితే పేలిపోతున్నాయి. ఇటు టైటిల్ లుక్‌, ఫ‌స్ట్ లుక్ కూడా మామూలుగా లేవు. ఇప్ప‌టి వ‌ర‌కు సినిమా నుంచి రిలీజ్ అయిన అన్నీ మామూలు ఎలివేష‌న్లు కావు. మ‌లినేని గోపీచంద్ ఓ సూప‌ర్ హిట్ ఇవ్వ‌బోతున్నాన‌న్న ప్రామీసింగ్ అయితే ఫ్యాన్స్‌కు ఇచ్చేశాడు.

ఇక ఈ సినిమా నుంచి లీక్ అయిన స్టోరీ డైలాగులు వింటుంటేనే గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. ఓ డైలాగ్ అయితే మామూలుగా లేదు. ఫ్యీజులు ఎగిరిపోతున్నాయి. బాల‌య్య ఎడ‌మ కాలు తొడ‌కొట్టి ఒక అడుగు ముందుకు వేసి విల‌న్ దునియా విజ‌య్ పీక‌మీద కాలుపెట్టి… పులివెందుల అయినా పులిచ‌ర్ల అయినా పులిబిడ్డ ఈ వీర‌సింహారెడ్డి. ఈ వీర‌సింహారెడ్డి ప్ర‌జ‌ల ముందు ఉంటే.. సింహం ముందు ఉన్న‌ట్టే.. ఆ సింహాన్ని ఎదిరించి వెళ్లే దమ్ము ఉంటే.. రేయ్ నువ్వు న‌న్ను దాటి ప్ర‌జ‌ల ద‌గ్గ‌ర‌కు వెళ్ల‌రా ? ఇది డైలాగ్‌.

మ‌రి డైలాగ్ ఎంత ప‌వ‌ర్ ఫుల్‌గా ఉందో చూస్తుంటేనే అర్థ‌మ‌వుతోంది. ఇక ఈ సినిమా స్టోరీ లైన్ చూస్తే బాల‌య్య సినిమాలో డ్యూయెల్ రోల్లో క‌నిపిస్తాడు. ఒక‌టి విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో వీర‌సింహారెడ్డిగా, రెండోది యూఎస్ నుంచి వ‌చ్చే రోల్ బాల‌సింహారెడ్డి. ఇవి తండ్రి కొడుకుల క్యారెక్ట‌ర్లు. ఈ రెండు పాత్ర‌ల మ‌ధ్య వేరియేష‌న్ అదిరిపోతుంద‌ట‌.

గ్రామ రాజ‌కీయాల్లో వీర‌సింహారెడ్డి చ‌నిపోతే బాల సింహారెడ్డి విల‌న్ల‌పై రివేంజ్ తీర్చుకుంటాడ‌ట‌. అలాగే గ్రామాభివృద్ధి కోసం త‌న తండ్రి క‌న్న క‌ల‌లు నెర‌వేర్చ‌డంతో పాటు ఆయ‌న ఆశ‌యం తీర్చ‌డం, సాఫ్ట్‌వేర్ నుంచి వ‌చ్చిన‌వాడు ఫ్యాక్ష‌న్ రాజ‌కీయాల్లోకి వ‌స్తే వీడు పిల్ల బ‌చ్చాగాడు అని లైట్ తీస్కొన్న వాళ్ల‌కు ఎలా ? బుద్ధి చెప్పాడుడ అన్న‌దే స్టోరీ. ఏదేమైనా లైన్ వింటుంటేనే బాల‌య్య‌కు మ‌రో ప‌క్కా బ్లాక్‌బ‌స్ట‌ర్ అనేలా ఉంది. మ‌రి రేపు థియేట‌ర్ల‌లో బాల‌య్య విశ్వ‌రూపం ఎలా ఉండ‌బోతోందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news