Moviesడ‌బుల్ సెంచ‌రీ వీరుడు ఇషాన్ కిష‌న్‌ గ‌ర్ల్‌ఫ్రెండ్ ర‌చ్చ... ఆమె బ్యాక్‌గ్రౌండ్...

డ‌బుల్ సెంచ‌రీ వీరుడు ఇషాన్ కిష‌న్‌ గ‌ర్ల్‌ఫ్రెండ్ ర‌చ్చ… ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే…!

జార్ఖండ్ యంగ్ డైనమైట్ టీమిండియా యంగ్ బ్యాటర్ ఇషాన్ కిష‌న్ ఇప్పుడు నెట్ ఇంట్లో రచ్చ లేపుతున్నాడు. బంగ్లాదేశ్ తో జరిగిన మూడో వన్డేలో డబుల్ సెంచరీ చేయడంతో పాటు ఎన్నో రికార్డులు తన ఖాతాలో వేసుకున్న ఇషాన్‌పై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇప్పుడు ఈ యంగ్ వికెట్ కీపర్ అభిమానుల మనసులను దోచుకోవడంతో పాటు సోషల్ మీడియాలో మార్మోగిపోతున్నాడు. అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి భారత్‌కు ఘనవిజయం సాధించి పెట్టిన ఇషాన్‌ను ఎంత ప్రశంసించినా తక్కువే అంటూ టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రసంసించాడు.

టీమిండియాకు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాంటి ఆటగాడు కావాలని వీరేంద్ర సెహ్వాగ్, నిన్ను చూస్తే గర్వంగా ఉందని స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా మెచ్చుకున్నారు. ఇషాన్ తో కలిసి అద్భుత ఇన్నింగ్స్ ఆడిన రన్‌మెషన్ విరాట్ కోహ్లీ సైతం సూపర్ ఇన్నింగ్స్ అంటూ ప్రశంసిస్తే.. ఇప్పుడు ఇషాన్ కు స్పెషల్ పర్సన్ నుంచి అందిన విషెస్ నెట్ ఇంట్లో వైరల్ గా మారింది. ఆమె ఓ లేడీ కావడం విశేషం. ఆమె పేరు అదితి హుండియా. ఆమె ఇషాన్ గర్ల్ ఫ్రెండ్ అని ప్రచారం జరుగుతోంది.

మిస్ ఇండియా ఫైనలిస్టు అయిన అదితి బాలీవుడ్లో మోడల్‌గా కెరీర్‌ ప్రారంభించి విజయవంతంగా కొనసాగిస్తోంది. వీరిద్దరూ కలిసి గతంలో చాలా సార్లు కెమెరాలుకు చిక్కారు. వీరు ప్రేమలో ఉన్నారంటూ కూడా కథనాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఇషాన్ వయసు 24 సంవత్సరాలు. అయితే తమ బంధం గురించి వస్తున్న వార్తలపై ఇషాన్, అదితి ఎవరు కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు. తాజాగా ఇషాన్‌ ఫోటోను ఇన్‌స్టా స్టోరీలో పెట్టిన అతిథి రెడ్ హార్ట్ ఎమోజితో తన ప్రేమను చాటుకుంది.

ఇక బంగ్లాదేశ్ తో జరిగిన మూడో వన్డేలో డబుల్‌ సెంచరీ కొట్టిన ఇషాన్ చాలా అరుదైన రికార్డులు సాధించారు. ప్రపంచ వన్డే క్రికెట్లో ఇప్పటివరకు వెస్టిండీస్ క్రికెటర్ క్రిస్‌గేల్ పేరు మీదఉన్న 138 బంతుల్లో డబుల్ సెంచరీ రికార్డును తిరగరాసి 126 బంతుల్లోనే డబుల్ సెంచరీ కొట్టాడు. చిన్న వయసులో ( 24 ఏళ్ల 145 రోజుల్లో ) డబుల్ సెంచరీ సాధించి… రోహిత్ శర్మ 26 ఏళ్ల వయసులో ఆస్ట్రేలియాపై కొట్టిన డబుల్ సెంచరీ రికార్డును బ్రేక్ చేశాడు.’

వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన ఏడో క్రికెటర్‌గా ఇషాన్ రికార్డుల్లోకి ఎక్కాడు. మరో ట్విస్ట్ ఏంటంటే తొమ్మిదో ఇన్నింగ్స్‌ లోనే డబుల్ సెంచరీ సాధించిన ఇషాన్ కెరీర్‌లో ఒక్కసారి కూడా సెంచరీ కొట్టకుండానే డైరెక్ట్‌గా డబుల్ సెంచరీ సాధించిన తొలి ఆటగాడుగా వరల్డ్ రికార్డ్ సాధించాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news