Moviesమెగా కోడలు ప్రెగ్నెంట్ అని తెలిసి చిరంజీవి ఏం చేసాడో తెలుసా..చేతులెత్తి...

మెగా కోడలు ప్రెగ్నెంట్ అని తెలిసి చిరంజీవి ఏం చేసాడో తెలుసా..చేతులెత్తి దండం పెట్టాల్సిందే..!!

ప్రజెంట్ మెగా అభిమానులు ఏ రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . పదేళ్లుగా ఎప్పుడెప్పుడు అంటూ ఆశగా ఎదురుచూసిన గుడ్ న్యూస్ రానే వచ్చేసింది . ఈ క్రమంలోనే ప్రతి మెగా ఫ్యాన్ ఇంట్లో ప్రతిరోజు మెగా కోడలు ఉపాసన పేరు వినిపిస్తూనే ఉంటుంది . తెలుగు ఇండస్ట్రీలో ఫ్యాన్స్ హీరోలని ఎలా అభిమానిస్తారో మనకు తెలిసిందే . దేవుడు కన్నా ఎక్కువగా పూజిస్తారు ..భావిస్తారు అలాంటి ఇంటి కోడలు ప్రెగ్నెంట్ అంటే తమ సొంత వదినే ప్రెగ్నెంట్ అయినంత హ్యాపీగా ఫీల్ అయిపోతున్నారు మెగా ఫాన్స్ .

పెద్దవాళ్లు సైతం ఉపాసనకు సోషల్ మీడియా ద్వారా బ్లెస్సింగ్స్ అందజేస్తున్నారు. అలాంటి ఓ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది మెగా కోడలు ఉపాసన . కాగా మెగాకోడలు ఉపాసన ప్రెగ్నెంట్ అని తెలిసిన వెంటనే చిరంజీవి చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . మెగా ఫాన్స్ ఎంత ఈగర్ గా వెయిట్ చేసారో అంత ట్రిపుల్ రేంజ్ లో మెగాస్టార్ తన ఇంటి మనవడు కోసం వెయిట్ చేశాడు . ఈ విషయం అందరికీ తెలిసిందే .

కాగా మెగా కోడలు ఉపాసన ప్రెగ్నెంట్ అని తెలిసిన మరో క్షణం చిరంజీవి ,,పూజ గదిలోకి వెళ్లి ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు చేశారట . అంతేకాదు ఆంజనేయస్వామి సింధూరం తీసుకొచ్చి ఉపాసనను ఆశీర్వదించి ఎమోషనల్ అయ్యారట . ఇదే విషయం ఉపాసన తన ఫ్రెండ్స్ కు చెప్పినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంతేకాదు మెగా కోడలు ఇంతవరకు ప్రెగ్నెంట్ అవ్వలేదని చాలామంది మండిపడ్డారు ..బూతులు కూడా తిట్టారు. కానీ చిరంజీవి మాత్రం ఏనాడు ఆమెను చులకనగా చూడలేదు ..”వాళ్ళ లైఫ్ ..వాళ్ళ ఇష్టం ..వాళ్ళ నిర్ణయాన్ని నేను గౌరవిస్తానని చెప్పుకొచ్చారే.. తప్పిస్తే తనకు ఆశ ఉన్నా కానీ ఆశను బయట పెట్టలేదు”. దీంతో మెగాస్టార్ కి చేతులెత్తి దండం పెట్టాలి అంటూ మెగా ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news