Movies"అఖిల్ ఓ ఐరన్ లెగ్".. ఆ విషయం రష్మిక కు ముందే...

“అఖిల్ ఓ ఐరన్ లెగ్”.. ఆ విషయం రష్మిక కు ముందే తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ప్రతి హీరో స్టార్ కాలేరు . కనీసం సక్సెస్ కొట్టి జనాల దగ్గర శభాస్ అని కూడా అనిపించుకోలేరు .ఆలిస్టులోకే వస్తారు అక్కినేని నాగార్జున చిన్న కొడుకు అఖిల్ . సినిమా ఇండస్ట్రీలోకి బోలెడన్ని ఆశలతో అడుగు పెట్టిన అఖిల్.. ఇప్పటివరకు చాలా సినిమాలో నటించాడు. కానీ హిట్ కొట్టిన సినిమాలు ఒక్కటంటే ఒక్కటే. అది కూడా పూజా హెగ్డే ఖాతాలోనే పడిపోయింది .

బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్లో అఖిల్ హీరోగా పూజ హెగ్డే హీరోయిన్ గా వచ్చిన సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ . 15 అక్టోబర్ 2021 లో గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ టాక్ సంపాదించుకుంది. ఇప్పటివరకు అఖిల్ కెరియర్ లో నటించిన సినిమాలలో ఈ ఒక్క సినిమానే పాజిటివ్ హిట్ దక్కించుకోవడం విశేషం . మొదట ఈ సినిమాలో హీరోయిన్ గా అందాల ముద్దుగుమ్మ రష్మిక మందన్నాను ఫిక్స్ చేసుకున్నారట. బొమ్మరిల్లు భాస్కర్ కూడా కథ ప్రకారం రష్మిక అయితే ఈ పాత్రకు బాగా సెట్ అవుతుందని అనుకున్నారట .

కానీ అప్పటికే వేరే సినిమా షూటింగ్స్ లో బిజీగా ఉన్న రష్మిక ఈ సినిమాను రిజెక్ట్ చేసినట్టు తెలుస్తుంది . అయితే, ఎవ్వరికి తెలియని విషయం ఏంటంటే..అఖిల్ నటించిన అన్ని సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతున్నాయి. ఈ క్రమంలో ఆయన ఐరెన్ లెగ్ అంటూ కూడా ట్యాగ్ చేసారు జనాలు. ఈ కారణంగానే రష్మిక ఆయనతో సినిమాని రిజెక్ట్ చేసిందనే వార్త సినిమా ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తుంది. ఒకవేళ ఆయనతో నటిస్తే మంచి స్పీడ్ మీద ఉన్న కెరియర్ ఎక్కడ బ్రేక్ పడుతుందో అని రష్మిక అతనితో సినిమా చేయడానికి రిజెక్ట్ చేసినట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి . ఏది ఏమైనా సరే రష్మిక ఆనాడు తీసుకున్న నిర్ణయం మంచిదే అని అంటున్నారు జనాలు . ఎందుకంటే పూజా హెగ్డే ప్లేస్ లో రష్మిక మందన్నా ని ఊహించుకోలేం అంటూ కామెంట్స్ చేస్తున్నారు . చూడాలి మరి అఖిల్ అక్కినేని ఏజెంట్ సినిమాతో ఎలాంటి హిట్ అందుకుంటాడో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news