Moviesఅన్‌స్టాప‌బుల్ 2 షోలో 3 సూప‌ర్ హిట్‌... ఆ ఒక్క ఎపిసోడ్‌...

అన్‌స్టాప‌బుల్ 2 షోలో 3 సూప‌ర్ హిట్‌… ఆ ఒక్క ఎపిసోడ్‌ ఫ‌ట్‌…!

నంద‌మూరి బాల‌కృష్ణ అన్‌స్టాప‌బుల్ టాక్ షో ఫ‌స్ట్ సీజ‌న్ ఎంతో పెద్ద బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌. అస‌లు బాల‌య్య టాక్ షో చేయ‌డం ఏంట‌ని త‌ల‌లు ప‌ట్టుకున్న వాళ్ల మ‌తులుపోయేంత గొప్ప విజ‌యం సాధించింది. ఫ‌స్ట్ సీజ‌న్లో అన్ని ఎపిసోడ్లు బాగా పేలాయి. స్టార్ హీరోల‌ను అంద‌రిని దించేశారు. మ‌హేష్‌బాబు, బ‌న్నీ, మోహ‌న్‌బాబు ఫ్యామిలీ, రానా ఇలా ప్ర‌ముఖులు అంద‌రూ షోకు వ‌చ్చారు.. బాల‌య్య కూడా ఇంట్ర‌స్టింగ్ ప్ర‌శ్న‌లు వేసి అన్ని ఎపిసోడ్ల‌ను మంచిర‌క్తి క‌ట్టించారు.

ఇక సెకండ్ సీజ‌న్‌కు ఫ‌స్ట్ సీజ‌న్ స్థాయి సెల‌బ్రిటీల‌ను అయితే ప‌ట్టుకురాలేక‌పోయార‌నే చెప్పాలి. ఫ‌స్ట్ ఎపిసోడ్ వ‌ర‌కు చంద్ర‌బాబు, లోకేష్ రావ‌డంతో బాగానే పేలి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ అయ్యింది. పైగా తెలుగుదేశం కార్య‌క‌ర్త‌లు, అభిమానులు కూడా ఈ షో కోసం ఆహాను స‌బ్‌స్క్కైబ్ చేసుకున్నారు.. ఆహాకు ఈ షో వ‌ల్ల చాలా ప్ల‌స్ అయ్యింది. ఆ త‌ర్వాత యంగ్ హీరోలు సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ‌, విశ్వ‌క్‌సేన్‌ను రెండో ఎపిసోడ్‌కు, మూడో ఎపిసోడ్‌కు శ‌ర్వానంద్‌, అడ‌వి శేష్‌ను సెట్ చేశారు.

ఈ న‌లుగురు యంగ్ హీరోలు కావ‌డంతో వీరు చేసిన రెండు ఎపిసోడ్లు కూడా యూత్‌కు బాగా క‌నెక్ట్ అయ్యి మంచి వ్యూస్ వ‌చ్చాయి. ఇక‌నాలుగో ఎపిసోడ్‌కు మాజీ సీఎం కిర‌ణ్‌కుమార్ రెడ్డి, మాజీ స్పీక‌ర్ సురేష్‌రెడ్డితో పాటు సీనియ‌ర్ న‌టీమ‌ణి రాధిక‌ను తీసుకువ‌చ్చారు. అయితే ఈ ఎపిసోడ్ అంత‌గా క్లిక్ కాలేద‌ని ఆహా కాంపౌండ్ ఇన్న‌ర్‌సైడ్ వ‌ర్గాల టాక్ ? ప్ర‌శ్న‌లు కూడా మ‌రీ అంత స్పైసీగాను, ఆస‌క్తిగాను లేవు. పైగా ఇద్ద‌రు రాజ‌కీయ నేత‌లు కావ‌డంతో ఎంట‌ర్టైన్‌మెంట్ కోర‌కునే వాళ్లు ఈ ఎపిసోడ్‌పై ఆస‌క్తి చూప‌లేదంటున్నారు.

అస‌లు కిర‌ణ్‌కుమార్‌, సురేష్‌రెడ్డితో సాక్షి పేప‌ర్ ఎప్పుడో 2009లోనే ఓ జాయింట్ ఇంట‌ర్వ్యూ ఇచ్చింది. మ‌ళ్లీ వాళ్ల‌నేక‌ల‌ప‌డం తో ఆస‌క్తి పోయింది. ఇక కాంబినేష‌న్లు సెట్ చేయ‌డంలో కూడా అన్‌స్టాప‌బుల్ టీం ఫెయిల్యూర్ క‌నిపించింది. బాల‌య్య‌తో అడిగించే ప్ర‌శ్న‌లు కూడా మ‌రింత స్పైసీగాను, కాస్త కారంగా ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. అయితే ఈ సీజ‌న్‌కే స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్ అయిన ఎపిసోడ్ వ‌చ్చేయ‌నుంది.

యంగ్‌రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌, గోపీచంద్ కాంబినేష‌న్ ఎట్ట‌కేల‌కు సెట్ చేశారు. ఈ ఎపిసోడ్ షూటింగ్ ఈ నెల 11న జ‌ర‌గ‌నుంద‌ని క్లారిటీ వ‌చ్చింది. ఈ వెరీ వెరీ స్పెష‌ల్ ఎపిసోడ్‌ను ఈ నెల చివ‌ర్లో డిసెంబ‌ర్ 31న న్యూఇయ‌ర్ కానుక‌గా స్ట్రీమింగ్ చేయాల‌ని ఆహా టీం ప్లాన్ చేస్తోంది. ఏదేమైనా ప్ర‌భాస్ ఎంట్రీతో అన్‌స్టాప‌బుల్ సీజ‌న్ 2కే స‌రికొత్త క‌ళ వ‌చ్చింద‌నే చెప్పాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news