Moviesభూకైలాస్ ఫ‌ట్‌.. గుండ‌మ్మ‌క‌థ హిట్‌.. అక్కినేని - ఎన్టీఆర్ చేసిన బిగ్...

భూకైలాస్ ఫ‌ట్‌.. గుండ‌మ్మ‌క‌థ హిట్‌.. అక్కినేని – ఎన్టీఆర్ చేసిన బిగ్ రిస్క్ ఇదే…!

తెలుగు చిత్ర‌రంగంపై చెర‌గ‌ని ముద్ర వేసిన అక్కినేని నాగేశ్వ‌ర‌రావు, ఎన్టీఆర్ ఇద్ద‌రూకూడా స్టార్ హీరోలే. ఒక‌ప్ప‌టికి ప్రేక్ష‌కులు ఆరాధ్య దైవాలే. అయితే, వీరిద్ద‌రూ కూడా అనేక చిత్రాల్లో క‌లిసి న‌టించారు. కానీ, కొన్ని ఆడాయి.. కొన్ని ఆడ‌లేదు. అయినా, వారు ఎక్క‌డా కుంగిపోలేదు. ఇబ్బంది ప‌డ‌లేదు. వ‌చ్చిన అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకున్నారు. ఆదిలో ఇద్దరూ క‌లిసి న‌టించిన భూకైలాస్ సినిమా బాక్సాఫీస్ వ‌ద్దే అనుకున్న స్థాయిలో ( భారీ అంచ‌నాల నేప‌థ్యంలో ) ఆడ‌లేదు.

ఇక‌, గుండ‌మ్మ క‌థ సూప‌ర్‌డూప‌ర్ హిట్ట‌యింది. అయినా.. ఎక్క‌డో అభిమానుల మ‌ధ్య అంత‌రం, అనుమానం రెండూ ఉన్నాయి. ఇదిలావుండ‌గానే.. జయంతి పిక్చర్స్ ప‌తాకంపై శ్రీ కృష్ణార్జున యుద్ధము (1963) చిత్రం ఆఫ‌ర్ వ‌చ్చింది. అన్న‌గారు శ్రీకృష్ణుడిగా నటించిన ఈ చిత్రంలో శ్రీరంజని జూనియర్, ఎస్.వరలక్ష్మి రుక్మిణీ సత్యభామలుగా నటించారు. చిత్రంలో ప్రధానాంశం గయోపాఖ్యానం. ఈ ఘట్టం చాలా చిన్నది.. అందుకని పారిజాతాపహరణం, సుభద్రార్జునీయం ఘట్టాలను కూడా. తీసుకుని కథను అల్లారు.

ఇక‌, ఈ సినిమాకు దర్శ‌కుడు, నిర్మాత కూడా ప్ర‌ఖ్యాత‌ కె.వి.రెడ్డి. మరో విశేషం ఏంటంటే.. అర్జునుడుగా అక్కినేనిని తీసుకున్నారు. అయితే, అప్పటికే ఇటు నందమూరి, అటు అక్కినేనికి తెలుగు, త‌మిళ చిత్ర సీమ‌ల్లో ల‌క్ష‌ల మంది అభిమానులు పెరిగిపోయారు. అలాంటి సమయంలో ఇద్దరు హీరోలూ ఈసినిమా ఏమ‌వుతుందో అనే సంశ‌యం ప‌డ్డా.. ద‌ర్శ‌కుడు దిట్ట కావ‌డంతో సాహ‌సం చేశారు.

తమతో కె.వి. సినిమా తీస్తున్నారంటే ఎవరికీ ఎలాంటి లోపం జరగదన్నది వారిద్దరి ఏకాభిప్రాయం. కె.వి.రెడ్డి కూడా వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయలేదు. సుభద్రా కల్యాణం ఘట్టమంతా అర్జునుడి చిలిపితనం మీద నడిపించి అక్కినేని ఇమేజ్‌కు భంగం క‌ల‌కుండా చూసుకున్నారు. ఇక‌, ఎన్టీఆర్‌ను శ్రీకృష్ణుడిగా చూపించి నందమూరి అభిమానుల మ‌న‌సు దోచుకున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news