Moviesపెళ్ళి చేసుకోబోతున్న సిద్ధార్ధ్-అదితి..ఎట్టకేలకు ఓపెన్ అప్ అయ్యారుగా..!!

పెళ్ళి చేసుకోబోతున్న సిద్ధార్ధ్-అదితి..ఎట్టకేలకు ఓపెన్ అప్ అయ్యారుగా..!!

టాలీవుడ్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న సిద్ధార్ధ్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చేసింది కొన్ని సినిమాలు అయినా సరే వాటిల్లో తన ఎక్సలెంట్ టాలెంట్ ను బయటపెట్టి అమ్మాయిల కలల రాకుమారుడుగా ఎదిగిపోయాడు. మరీ ముఖ్యంగా “నువ్వొస్తానంటే నేనొద్దంటానా” సినిమా తర్వాత సిద్ధార్ధ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఓ రేంజ్ లో పెరిగిపోయిందో మనం చూస్తూనే ఉన్నాం. ఆ తర్వాత బొమ్మరిల్లుతో ఇండస్ట్రీ స్టార్ హీరోగా మారిపోయాడు .

 

అయితే తాను చేసే సినిమాలో నటించిన హీరోయిన్స్ అందరితో అఫైర్స్ నడుపుతున్నారని ఒక రూమర్ కారణంగా సిద్ధార్ధ్ సినీ కెరియర్ ఫ్లాప్ అయింది . అయితే అది రూమర్ కాదు నిజమే అంటున్నారు అభిమానులు . ఎప్పటికప్పుడు సిద్ధార్ధ్..ఎవరో ఒక అమ్మాయితో తిరుగుతూనే ఉంటాడు . గతంలో సమంత ..ఆ తర్వాత హన్సిక.. ఆ తర్వాత శృతిహాసన్.. ఇలా అందరూ ఆయన వాడేసి వదిలేసిన హీరోయిన్స్ అంటూ జనాలు చెప్పుకుంటున్నారు.

కాగా రీసెంట్గా అదే ఖాతాలకు చేరింది అందాల ముద్దుగుమ్మ అధితి . మహా సముద్ర అనే సినిమాలో వీళ్లిద్దరు కలిసి నటించారు . ఆ టైంలోనే వీళ్లిద్దరి మధ్య క్లోజ్ నెస్ మరింత ఎక్కువగా పెరిగిపోయింది ..ఇప్పటికీ ఈ జంట పబ్బులకు పార్టీలకు బయట తిరుగుతూనే ఉన్నారు . ఎప్పటికప్పుడు మీడియా కంట పడుతూనే ఉన్నారు.

ఇదివరకే ఒకసారి మీడియా కంట చిక్కిన వీళ్ళు ఆన్సర్ ఇవ్వకుండా తప్పించుకొని ..మీడియాపై ఫైర్ అయ్యారు. మరోసారి అలాగే అడ్డంగా మీడియాకు చిక్కారు ఈ రొమాంటిక్ పెయిర్. తాజాగా వీరిద్దరు ముంబై హోటల్లో కనిపించారు. చట్టాపట్టాలేసుకొని తిరుగుతూ ఈ ప్రేమ జంట రొమాంటిక్ మూడ్ లో కనిపించారు. దీంతో వీళ్ళు అఫీషియల్ గా తమ ప్రేమను కన్ఫామ్ చేసిన్నట్లైంది. అంతే కాదు బాలీవుడ్ మీడియాలోను వీళ్లు పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు కూడా వైరల్ అవుతుంది. చూడాలి మరి సిద్దు దీనిపై ఎలా స్పందిస్తాడో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news