Moviesit's Official: మెగా అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించే సర్ప్రైజ్.. బ్లాక్...

it’s Official: మెగా అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించే సర్ప్రైజ్.. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ తో రాంచరణ్..!!

వావ్ ..ఇది నిజంగా మెగా అభిమానులకు గుడ్ న్యూస్ అని చెప్పాలి . రీసెంట్గా ఆర్ఆర్ఆర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న రాంచరణ్ ..ప్రజెంట్ శంకర్ డైరెక్షన్లో బడా ప్రాజెక్టులో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కంప్లీట్ అయ్యాక రామ్ చరణ్ ఏ డైరెక్టర్ తో నటిస్తారా అంటూ పెద్ద చర్చ నడిచింది .

కొందరు లోకేష్ కనగరాజ్ అని, కొందరు బుచ్చిబాబు అని, మరికొందరు మెహర్ రమేష్.. ఇలా ఒకరి తర్వాత ఒకరి పేర్లు వైరల్ గా మారాయి . కాగా రీసెంట్గా అందుతున్న సమాచారం ప్రకారం ..రామ్ చరణ్ తదుపరి సినిమాను బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సుకుమార్ తో ఫిక్స్ అయ్యారట .అంతేకాదు సినిమాకి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తయిందని అఫీషియల్ గా ప్రకటించాడు సాబు సిరిల్.

రామ్ చరణ్ సుకుమార్ కాంబోలో రెండవ చిత్ర షూటింగ్ ప్రారంభమైనట్లు స్వయంగా క్రేజీ ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్ రివీల్ చేశారు. రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఈ కాంబోలో ఒక సినిమా రావాలని జనాలు కోరుకున్నారు . ఇన్నాళ్లకి ఆ జల నెరవేరింది. సాబు సిరిల్ మాట్లాడుతూ..” సుకుమార్ రామ్ చరణ్ మూవీ ఇంట్రడక్షన్ సీన్ షూటింగ్ ఆల్రెడీ పూర్తయిందని ..ఆ సీన్ తెరపై చూస్తే జనాలకు పూనకాలు వచ్చేస్తాయని ..గూస్ బంప్స్ తెప్పించేలా ఆ సీన్ డిజైన్ చేశారని.. ఇప్పటివరకు మీరు చూసిన రాంచరణ్ వేరు..ఈ సినిమాలో చూసే చహ్రణ్ వేరు అని.. ఈ సీన్ చూసాక ఆడియన్స్ సీట్లలో కూర్చునే ఛాన్సెస్ లేవని ..ఎగిరి గంతులు వేస్తారని మెగా హీరో అంటే ఇతనే అనేంతలా డిజైన్ చేశారని చెప్పుకొచ్చాడు. దీంతో ఈ సీన్ ఎప్పుడెప్పుడు చూద్దామా అంటూ మెగా ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news