Moviesవీర‌సింహారెడ్డి జై బాల‌య్య సాంగ్ వ‌చ్చేసింది... చిరు బాస్ పార్టీని మించి...

వీర‌సింహారెడ్డి జై బాల‌య్య సాంగ్ వ‌చ్చేసింది… చిరు బాస్ పార్టీని మించి ఉంటుందా…!

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ న‌టిస్తోన్న వీర‌సింహారెడ్డి సినిమా సంక్రాంతికి థియేట‌ర్ల‌లోకి దిగ‌నుంది. మ‌లినేని గోపీచంద్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ దాదాపు చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. మైత్రీ మూవీస్ బ్యాన‌ర్‌పై తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో శృతీహాస‌న్ హీరోయిన్‌. థ‌మ‌న్ స్వ‌రాలు అందిస్తున్నాడు. ఇక ఈ సినిమా లీకుల పరంప‌ర కొన‌సాగుతోంది.

ఇప్ప‌టికే వీర‌సింహారెడ్డి సినిమాకు సంబంధించిన లొకేష‌న్ స్టిల్స్ బ‌య‌ట‌కు చాలాసార్లు వ‌చ్చాయి. మైత్రీ మూవీస్ వాళ్లు మ‌రి జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారో లేదో కాని ఈ సినిమా అవుట్ డోర్ షూటింగ్ ఎక్క‌డ జ‌రుగుతున్నా ఆ స్టిల్స్ బ‌య‌ట‌కు వ‌చ్చేస్తున్నాయి. అయితే ఫొటోలు మాత్ర‌మే కాకుండా ఇప్పుడు సినిమాలో హీరో ఇంట్ర‌డ‌క్ష‌న్ సాంగ్ జై బాల‌య్యా కూడా లీక్ అయ్యింది.

ఈ సాంగ్ ఈ నెల 25న అఫీషియ‌ల్‌గా రిలీజ్ చేయ‌నున్నారు. సాంగ్ బ‌య‌ట‌కు రాకుండానే లీక్ కావ‌డంతో థ‌మ‌న్ ఫైన‌ల్ సాంగ్ ఎంత బాగా ఇచ్చి ఉంటాడా ? అన్న చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. ఇక వీర‌సింహారెడ్డికి పోటీగా సంక్రాంతి బ‌రిలోకి దిగుతోన్న చిరు వాల్తేరు వీర‌య్య బాస్ పార్టీ కూడా రీసెంట్‌గా రిలీజ్ చేశారు. దీంతో ఈ సాంగ్‌కు రేపు రిలీజ్ అయ్యే బాల‌య్య సాంగ్‌కు మ‌ధ్య ఖ‌చ్చితంగా కంపేరిజ‌న్ అయితే వ‌స్తుంది.

బాస్ పార్టీ సాంగ్ రొటీన్‌గా ఉంద‌ని.. థ‌మ‌న్ ఇచ్చిన ట్యూన్ కూడా రొటీన్‌గా ఉంద‌న్న టాకే ఎక్కువుగా న‌డుస్తోంది. మ‌రి జై బాల‌య్య సాంగ్ ఓ మోస్త‌రుగా ఉన్నా కూడా క్లిక్ అయ్యేందుకే ఎక్కువ ఛాన్సులు ఉన్నాయి. మ‌రి థ‌మ‌న్ అఖండ‌లో జై బాల‌య్యా సాంగ్‌లా మ‌రోసారి మ్యాజిక్ చేస్తే బాల‌య్య సాంగ్ దుమ్ము దులుప‌డం ఖాయం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news