Movies' వీర‌సింహారెడ్డి ' డిజిట‌ల్ రైట్స్ డీల్ క్లోజ్‌... బాల‌య్య గ‌ర్జ‌న...

‘ వీర‌సింహారెడ్డి ‘ డిజిట‌ల్ రైట్స్ డీల్ క్లోజ్‌… బాల‌య్య గ‌ర్జ‌న ఎన్ని కోట్లు అంటే…!

నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం మలినేని గోపీచంద్ దర్శకత్వంలో వీర సింహారెడ్డి సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అఖండ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత బాలయ్య నటిస్తున్న సినిమా కావటం.. ఇటు రవితేజతో క్రాక్ లాంటి ఊర మాస్ హిట్ సినిమా తర్వాత మలినేని గోపీచంద్ దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో వీర సింహారెడ్డిపై భారీ అంచనాలు ఉన్నాయి.

బాలయ్యకు బాగా కలిసి వచ్చిన రాయలసీమ యాక్షన్ డ్రాప్ కావడం… అటు మాస్‌ టైటిల్ ఉండటం, బాలయ్య డ్యూయల్ రోల్‌లో కనిపిస్తుండడంతో సినిమాపై అంచనాలు అయితే ఆకాశాన్ని అంటే రేంజ్ లో ఉన్నాయి. దీనికి తోడు సంక్రాంతి బరిలో రంగంలోకి దిగుతుండటంతో వీరసింహారెడ్డికి ట్రేడ్‌ సర్కిల్స్‌లో భారీ ఎత్తున ప్రి రిలీజ్ బిజినెస్ కూడా జరుగుతోంది. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా చివరి షెడ్యూల్ డిసెంబర్ నుంచి ప్రారంభం కానుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ డీల్ కూడా క్లోజ్ అయింది. ఈ సినిమా ఓటీటీ రైట్స్ అమెజాన్ ప్రైమ్ రూ.11 కోట్లు పెట్టి కొన్నట్టు తెలిసింది. అఖండ తర్వాత బాలయ్య బిజినెస్ రేంజ్ బాగా పెరిగింది. అందుకే అటు అన్ని ఏరియాల్లోనూ వీర సింహారెడ్డి బాలయ్య కెరీర్ లోనే హైయెస్ట్ రేట్ల‌కు కొనుగోలు చేస్తున్నారు.

ఓవర్సీస్ లోనూ వీర సింహారెడ్డికి అదిరిపోయే డీల్స్ వస్తున్నాయి. ఇక ఇటు డిజిటల్ ప్లాట్ ఫామ్‌లో కూడా బాలయ్య కెరీర్ లోనే టాప్ రేట్‌కు అమ్ముడు పోయింది. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే బాలయ్య – అనిల్ రావిపూడి దర్శకత్వంలో తన 108వ‌ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి సినిమా తర్వాత ఆదిత్య 369 సినిమాకు సీక్వెల్ గా సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో ఆదిత్య 999 సినిమాకు బాల‌య్య ఓకే చెప్పాడు.

ఆ తర్వాత బోయపాటి శ్రీను, పూరి జగన్నాథ్ సినిమాలను కూడా బాలయ్య లైన్‌లో పెడుతున్నాడు. ఏదేమైనా వీర సింహారెడ్డి బాలయ్య కెరీర్ లోనే రిలీజ్ ముందే ఇన్ని సంచలనాలు క్రియేట్ చేయటం నందమూరి ఫ్యాన్స్ లో సరికొత్త ఉత్సాహం నింపుతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news