Moviesనిన్నుతాకే ద‌మ్మున్నోడు.. ఆ మొల‌తాడు క‌ట్టిన‌ మొగోడు లేనేలేడు... జై బాల‌య్యా...

నిన్నుతాకే ద‌మ్మున్నోడు.. ఆ మొల‌తాడు క‌ట్టిన‌ మొగోడు లేనేలేడు… జై బాల‌య్యా చంపేశావ్ ( వీడియో)

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ వీర‌సింహారెడ్డి జై బాల‌య్య మాస్ సాంగ్ వ‌స్తుంద‌న్న ప్ర‌క‌ట‌న వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి బాల‌య్య అభిమానులు ఉర్రూత‌లూగిపోతున్నారు. ఈ సాంగ్ ఈ రోజు వ‌చ్చేసింది. మొత్తం 3.50 నిమిషాల పాటు ఉన్న ఈ సాంగ్ మాస్ జ‌నాల‌కు మాంచి కిక్ ఇచ్చేలా ఉంది. రాజ‌సం నీ ఇంటి పేరు.. పౌరుషం నీ ఒంటి పేరు.. జై బాల‌య్యా.. జై బాల‌య్యా అంటూ ప‌ల్ల‌వితో సాగే ఈ సాంగ్ అయితే అదిరిపోయేలా ఉంది.

ఇక సాంగ్‌లో నిన్ను త‌ల‌చుకున్న వారు లేచినుంచి మొక్కుతారు.. జై బాల‌య్యా… జై బాల‌య్యా మా అండ‌దండ నువ్వుంటే అంతా చాల‌య్యా… తిప్పుసామీ కోర‌మీసం.. తీప్పుసామి ఊరికోసం అన్న ప‌దాలు సినిమాలో బాల‌య్య క్యారెక్ట‌ర్ ఎంత ప‌వ‌ర్ ఫుల్‌గా ఉందో చెప్ప‌క‌నే చెపుతున్నాయి. ఓ గుడి బ్యాక్‌డ్ర‌ప్‌లో ఈ సాంగ్ వ‌స్తున్న‌ట్టుగా విజువ‌ల్స్ చెపుతున్నాయి. సాంగ్‌లో మేల్ వెర్ష‌నే ఎక్కువుగా ఉండ‌గా.. కోర‌స్ మాత్రం ఫీమేల్ వెర్ష‌న్‌లో ఉంది.

న‌మ్ముకున్న వారి కోసం అగ్గిమంటే ఈ ఆవేశం… నిన్నుతాకే ద‌మ్మున్నోడు లేనేలేడ‌య్యా .. ఆ మొల‌తాడు క‌ట్టిన మొగోడు ఇంకా పుట్ట‌నే లేద‌య్యా అన్న ప‌దాలు అయితే మ‌రీ ప‌వ‌ర్ ఫుల్‌గా ఉన్నాయి. అయితే థ‌మ‌న్ ట్యూన్ విష‌యంలో అఖండ జై బాల‌య్య సాంగ్‌లా కాస్త క్యాచీ ట్యూన్ ఇచ్చి ఉంటే సాంగ్ మ‌రింత క‌నెక్ట్ అయ్యేది ట్యూన్ క‌రెక్టుగా కుదిరితే సాంగ్ ఒక్క‌సారి విన‌గానే మైండ్‌కు ఎక్కేసేది.

ఏదేమైనా జై బాల‌య్య సాంగ్ వ‌చ్చి రావ‌డంతోనే బాల‌య్య అభిమానుల‌కు, మాస్ జ‌నాల‌కు పూన‌కాలు తెప్పించేస్తోంది. మ‌రి రేపు థియేట‌ర్ల‌లో అఖండ జై బాల‌య్య సాంగ్‌లా మార్మోగిపోయేలా చేస్తుందేమో ? చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news