Moviesత‌మ‌న్నా కోరిక బాల‌య్య తీర్చేస్తాడా... మిల్కీబ్యూటీ ఇప్పుడు బాధ‌ప‌డుతోందా...!

త‌మ‌న్నా కోరిక బాల‌య్య తీర్చేస్తాడా… మిల్కీబ్యూటీ ఇప్పుడు బాధ‌ప‌డుతోందా…!

కొన్నిసార్లు హీరోలు, హీరోయిన్లు తమకు వచ్చిన మంచి అవకాశాలను మిస్‌ చేసుకుంటారు. రెమ్యూనరేషన్ కారణంగానో లేదా ఇతర సినిమా షూటింగులతో బిజీగా ఉండటంవల్ల మంచి ఛాన్సులు మిస్ చేసుకుని ఆ తర్వాత బాధపడుతూ ఉంటారు. మిల్కీ బ్యూటీ తమన్నా కూడా ఇప్పుడు అలాగే బాధపడుతోందట. మూడున్నర పదుల వయసుకు వచ్చిన తమన్నా ఇప్పటికీ లైవ్ లోనే ఉంది. ఇంకా చెప్పాలంటే టాలీవుడ్ లో సీనియర్ హీరోలకు తమన్నా మంచి ఆప్షన్ గా మారిపోయింది. విక్టరీ వెంకటేష్, మెగాస్టార్ చిరంజీవి లాంటి స్టార్ హీరోలు తమన్నాకు వరుస‌ పెట్టి అవకాశాలు ఇస్తున్నారు.

వెంకటేష్ పక్కన ఇప్పటికే ఎఫ్2 – ఎఫ్3 సినిమాల్లో తమన్నా జోడి కట్టింది. తమన్నా – వెంకీ జోడి ఆన్ స్క్రీన్ రొమన్స్ అదిరిపోయింది. మెగాస్టార్ చిరంజీవితో నటించాలని ఎప్పటినుంచో తాకు కోరిక ఉందని చెబుతూ వస్తున్న తమన్న సైరా సినిమాలో జోడి కట్టేసింది. అయితే ఆ సినిమాలో త‌మ‌న్నాది రెండో హీరోయిన్ రోల్‌. ఇక ఇప్పుడు మెహర్ రమేష్ దర్శకత్వంలో వస్తున్న భోళాశంకర్ సినిమాలోని చిరుకు జోడిగా నటిస్తోంది. ఇక యువరత్న నందమూరి బాలకృష్ణ పక్కన నటించే గోల్డెన్ ఛాన్సును తమన్నా గతంలో వదులుకుంది.

బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన‌ అఖండ సినిమాలో హీరోయిన్‌గా ముందు తమన్నానే సంప్రదించారు. అయితే అప్పుడు తమన్నా ఇతర సినిమా షూటింగులతో బిజీగా ఉంది. అఖండలో నటించేందుకు ఆమె ఒప్పుకోలేదు. అయితే అఖండ సూపర్ డూపర్ హిట్ అయింది. తమన్నా వదులుకున్న లక్కీ ఛాన్స్ ప్రగ్యా జైస్వాల్ కొట్టేసింది. నిజంగా తమన్నా అఖండ సినిమా చేసి ఉంటే ఆమె క్రేజ్ ఎక్కడో ఉండేది. కచ్చితంగా ఈ ముదురు వయసులో అది తమన్నాకు హెల్ప్ అయ్యి ఉండేది.

సినిమా సూపర్ హిట్ అవడంతో పాటు సినిమాలో నటించిన నటీనటులు అందరికీ మంచి పేరు రావడంతో… ఇప్పుడు తమన్నా మంచి ఛాన్స్ వదులుకొని తప్పు చేశానని బాధపడుతోందట. మరోసారి బాలయ్యతో ఛాన్స్ వస్తే అస్సలు వదులుకోకూడదని తమన్నా ఫిక్స్ అయిపోయిందట. ఇక గతంలోనూ తమన్నా సవ్యసాచి – స్పైడర్ – శివ‌మ్‌ సినిమాలలో నటించింది. మ‌రి మ‌ళ్లీ త‌మ‌న్నాకు బాల‌య్య ఛాన్స్ ఇస్తాడో ? లేదో కాల‌మే నిర్ణ‌యిస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news