Moviesమూగబోయిన శ్రేయ ఘోషల్ గొంతు..అభిమానుల ఆందోళన..అసలు ఏమైందంటే..?

మూగబోయిన శ్రేయ ఘోషల్ గొంతు..అభిమానుల ఆందోళన..అసలు ఏమైందంటే..?

శ్రేయ ఘోషల్ .. ఈ పేరు చెప్తే మ్యూజిక్ లవర్స్ కి బాడీలో తెలియని గూస్ బంప్స్ వచ్చేస్తాయి . ఎలాంటి పాటనైనా సరే పాడి మెప్పించగల శ్రేయ ఘోషల్.. అంటే ఇష్టం లేనివారు ఎవ్వరూ ఉండరు. క్లాసిక్, మాస్, రొమాంటిక్ , మెలోడీస్ ఎలాంటి పాటలైనా సరే తన గొంతుతో అవలీలగా మార్చుకొని ..ఆ పాట తన కోసమే రాశారా అన్నంత చక్కగా పాడుతుంది. అంతేకాదు ఆమె పాడితే ఇంకా ఇంకా వినాలి అనిపించే అంత హాయిగా ఉంటుంది .

తెలుగు రాకపోయినా సరే తెలుగులో పాటలు పాడి ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్న శ్రేయ ఘోషల్ ..గొంతు అంటే జనాలకు విపరీతమైన ఇష్టం. కాకపోతే రీసెంట్గా పెట్టిన పోస్ట్ చూసిన అభిమానులు గుండెఝల్లుమంది . నా గొంతు మూగబోయింది అంటూ శ్రేయ ఘోషల్ పెట్టిన పోస్ట్ షాకింగ్ గా అనిపించింది . శ్రేయా ఘోషల్ తన ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. ఇటీవల అమెరికాలో జరిగిన ఒక మ్యూజికల్ ఈవెంట్ తర్వాత తన గొంతు పాడడానికి రాలేదని ..కనీసం మాట కూడా మాట్లాడలేకపోయానని ..డాక్టర్స్ హెల్ప్ తీసుకున్న తర్వాత మళ్లీ తన గొంతు మునిపట్టిలా వచ్చిందని చెప్పుకొచ్చింది.

కాగా సంగీత ప్రపంచంలో 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అమెరికాలోని దాదాపు 7 నగరాల్లో సంగీత కచేరిలో పాల్గొనింది శ్రేయ ఘోషల్. కాగా ఈ మ్యూజికల్ ఈవెంట్ లోనే తన గొంతు మూగబోయిందని ఓరండాలో కచేరి తర్వాత పూర్తిగా మాట్లాడడానికి కూడా మాట రాలేదని. డాక్టర్ సమీర్ ట్రీట్మెంట్ తర్వాత మళ్లీ తాను యధావిధిగా పాడగలిగానని చెప్పుకొచ్చింది. దీంతో శ్రేయ ఘోషల్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news