Moviesమ‌హేష్‌పై జాన్వీ కామెంట్స్ చూస్తే ఫ్యాన్స్‌కు పిచ్చెక్కిపోవాల్సిందే... ఎంత డేరింగ్ రా...

మ‌హేష్‌పై జాన్వీ కామెంట్స్ చూస్తే ఫ్యాన్స్‌కు పిచ్చెక్కిపోవాల్సిందే… ఎంత డేరింగ్ రా బాబు…!

టాలీవుడ్‌లో ఎంత‌మంది స్టార్ హీరోలు ఉన్నా మ‌హేష్‌బాబు అందం గురించి ఎంత చెప్పుకున్నా త‌క్కువే. అందంలో మ‌హేష్‌ను కొట్టే హీరోయే ఉండ‌డు. మ‌హేష్ అందాన్ని సౌత్ ఇండియా హీరోయిన్లు మాత్ర‌మే కాదు.. అటు నార్త్ ఇండియా హీరోయిన్లు కూడా పిచ్చ‌గా పొగిడేస్తూ ఉంటారు. మ‌హేష్ అందాన్ని ఈ త‌రం జ‌న‌రేష‌న్ అమ్మాయిలు, హీరోయిన్లే కాదు.. 1980-90వ ద‌శ‌కంలో హీరోయిన్లు కూడా పొగ‌డ‌డం మామూలే.

 

అస‌లు మ‌హేష్ సినిమాలో ఒక్క‌సారి ఛాన్స్ వ‌స్తే బాగుండును అనుకునే క్రేజీ హీరోయిన్లు ఎంతోమంది ఉన్నారు. ఇప్ప‌టికే కియారా అద్వానీ లాంటి హీరోయిన్లు మహేష్ ప‌క్క‌న భ‌ర‌త్ అనే నేను సినిమాలో న‌టించారు. కియారా ఎన్నోసార్లు మహేష్‌తో న‌టించ‌డం త‌న‌కు ఎంతో హ్యాపీ అని చెప్పింది. ఇప్పుడు త్రివిక్ర‌మ్ సినిమాలో పూజా హెగ్డే న‌టిస్తోంది. స‌రిలేరు నీకెవ్వ‌రులో ర‌ష్మిక‌, స‌ర్కారువారిపాట‌లో కీర్తి సురేష్ న‌టించేశారు.

ఇలా వీరంద‌రు కూడా మ‌హేష్ ప‌క్క‌న న‌టించ‌డానికి ముందే మ‌హేష్‌ను ఆకాశానికి ఎత్తేసి మ‌రీ ఛాన్సులు ద‌క్కించుకున్నారు. ఇప్పుడు ఈ లిస్టులోకి మ‌రో క్రేజీ హీరోయిన్ వ‌చ్చేసింది. ఆ హీరోయిన్ ఎవ‌రో కాదు జాన్వీక‌పూర్‌. దివంగ‌త అతిలోక అందాల సుంద‌రి శ్రీదేవి, మ‌హేష్ తండ్రి దివంగ‌త కృష్ణ కాంబినేష‌న్లో ఎన్నో సూప‌ర్ హిట్ సినిమాలు వ‌చ్చాయి. ఆ త‌ర్వాత జాన్వీ టాలీవుడ్ ఎంట్రీపై గ‌త కొద్ది రోజులుగా చాలా చ‌ర్చ‌లే న‌డుస్తున్నాయి.

 

తాజాగా త‌న ఇంట‌ర్వ్యూలో మ‌హేష్‌బాబు గురించి చెప్ప‌మ‌ని అంటే మ‌హేష్ అందాన్ని తెగ పొగిడేసింది. మ‌హేష్ అందాన్ని తినేయాల‌న్నంత క‌సి, క్ర‌ష్ ఉంద‌ని చెప్పింది. వ‌య‌స్సుతో పాటు ఎవ‌రికి అయినా అందం త‌రుగుతుంది.. కానీ మ‌హేష్ సార్ అందం అంత‌కంత‌కు పెరుగుతూ పోతోంద‌ని .. ఇది నాకు చాలా షాకింగ్‌గా అనిపిస్తోంద‌ని చెప్పింది. అస‌లు మ‌హేష్ వైపు చూస్తుంటే ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియ‌క బ్లాక్ ఫేస్ పెడ‌తా అని కూడా చెప్పింది. ఏదేమైనా మ‌హేష్‌పై త‌నకున్న అభిమానం ఎలాంటిదో జాన్వీ త‌న మాట‌ల్లోనే చెప్పేసింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news