Moviesప‌వ‌న్ సినిమా అంటే ఫైనాన్స్ ఇవ్వ‌ట్లేదా... ఇంత దారుణ అవ‌మాన‌మా...!

ప‌వ‌న్ సినిమా అంటే ఫైనాన్స్ ఇవ్వ‌ట్లేదా… ఇంత దారుణ అవ‌మాన‌మా…!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే పై నుంచి కింద వరకు భూమి దద్దరిల్లి పోవాల్సిందే. సినిమా షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి రిలీజ్ రోజు వరకు మెయిన్ మీడియాతో పాటు.. సోషల్ మీడియా షేక్ అయిపోతుంది. పవన్ సినిమా కొనేందుకు బయ్యర్లు, ఎగ్జిబిటర్లు పోటీ పడతారు. పవన్ సినిమా ఖచ్చితంగా మా థియేటర్లోనే పడాలని పోటీపడి మరి లక్షలాది రూపాయల అడ్వాన్సులు ఇచ్చే ఎగ్జిబిటర్లు ఎంతోమంది ఉన్నారు. ఇక పవన్ సినిమా రైట్స్ సొంతం చేసుకోవాలనుకునే డిస్ట్రిబ్యూటర్ల సంగతి లెక్కేలేదు. పవన్ సినిమా స్టార్ట్ అవుతుంది అంటే ఫైనాన్స్ కు కొదవే ఉండదు. ఎంతో మంది ఫైనాన్షియర్లు క్యూ కడతారు.

అయితే ఇదంతా గతం. ఇప్పుడు పవన్ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుంది అంటే అసలు ఫైనాన్షియర్లు అటువైపే చూడని పరిస్థితి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ క్రిష్‌ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత కోలీవుడ్ లో హిట్ అయిన వినోదయ సీతం రీమేక్‌కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఈ రీమేక్‌కు సముద్రఖని దర్శకుడు. అలాగే హరీశంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్ సింగ్ సినిమా పోస్టర్లు కూడా బయటకు వచ్చాయి. అలాగే రామ్ తాళ్లూరి నిర్మించే మరో సినిమాకు సైతం పవన్ ఓకే చెప్పాడు.

పవన్ చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. మరోవైపు ఏపీలో వచ్చే ఎన్నికలకు ఏడాది మాత్రమే సమయం ఉంది. ఈలోగా ఎన్ని ? సినిమాలు పూర్తి చేస్తాడు. ఇప్పటివరకు కమిట్ అయిన నిర్మాతల పరిస్థితి ఏంటన్నది ఎవరికీ క్లారిటీ లేదు. అసలు పవన్ సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది ? ఎప్పుడు ఎండ్ అవుతుంది.. ఎప్పుడు రిలీజ్ అవుతుంది అన్నది కూడా ఎవరికీ అర్థం కావడం లేదు. అసలు పవన్ సినిమాలే పెద్ద గందరగోళంగా ఉన్నాయి.

పవన్ కళ్యాణ్ – మైత్రి మూవీ మేకర్స్ కాంబినేషన్లో రావాల్సిన సినిమాపై ఇప్పటికే చాలా వార్తలు వచ్చాయి. హరీశంకర్ దర్శకత్వంలో ఈ ప్రాజెక్ట్ తెరకెక్కనుంది. అయితే పవన్ ఈ సినిమా ఎప్పుడు ? స్టార్ట్ చేస్తాడు అన్నది మాత్రం ఎవరికీ అర్థం కావటం లేదు. ఇక ఫైనాన్షియర్లు కూడా పవన్ సినిమా అంటేనే ఆమడ దూరం పారిపోతున్నారు. మైత్రి మూవీస్ బ్యానర్ లో పవన్ హీరోగా తెరకెక్కే సినిమాకు ఫైనాన్షియర్లు ఎవ్వరు డబ్బులు ఇచ్చేందుకు ముందుకు రాని పరిస్థితి. ప్రస్తుతం మైత్రి చేతిలో వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య, ఖుషి, కళ్యాణ్ రామ్ అమిగోష్, అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాలు ఉన్నాయి.

ఇవన్నీ పెద్ద బడ్జెట్ సినిమాలే. అసలు వీటికి బడ్జెట్ సర్దుబాటు చేయడంతోనే నిర్మాతలు తలమునకలు అవుతున్నారు. ఇలాంటి టైంలో పవన్ కళ్యాణ్ సినిమా కోసం ఫైనాన్షియర్లు ముందుకు రాకపోవడంతో మైత్రి వాళ్ల‌ కష్టాలు మామూలుగా లేవు. అసలు పవన్‌ సినిమా అంటేనే ఫైనాన్షియర్లు దూసుకు రావాలి.. అయితే సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందో ? ఎప్పుడు రిలీజ్ అవుతుందో ? తెలియక ఇప్పుడు పవన్ సినిమా అంటేనే ఫైనాన్షియర్లు పారిపోతున్న పరిస్థితి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news