Moviesశ్రీహాన్ క్యారెక్టర్ ఇలాంటిదా..ఆ నైట్‌ కూకట్‌ పల్లిలో అమ్మాయితో ఏం చేసాడు..?

శ్రీహాన్ క్యారెక్టర్ ఇలాంటిదా..ఆ నైట్‌ కూకట్‌ పల్లిలో అమ్మాయితో ఏం చేసాడు..?

బిగ్ బాస్ కంటెస్టెంట్ సోహెల్ ఎక్కడ ఉంటే అక్కడ సందడి వాతావరణం ఉంటుంది. మనసులో ఏది పెట్టుకోకుండా ఉన్నది ఉన్నట్టు ఓపెన్ గా మాట్లాడేసి సరదాగా నవ్వించడం సోహెల్ స్పెషాలిటీ . బిగ్ బాస్ లో అలాంటి ప్రవర్తనతోనే మంచి కంటెస్టెంట్ అన్న పేరు తెచ్చుకున్నాడు . ఎంత మంచిగా ఉంటాడో ..తన జోలికి వస్తే అంత కోపం పెరిగిపోతుంది. తప్పు చేయకుండా ఒక మాట తప్పుపడితే అస్సలు ఒప్పుకోడు . కాగా బిగ్ బాస్ 6 ఫైనల్ ఎపిసోడ్ దగ్గర పడుతుంది.

ఈ క్రమంలోనే బిగ్ బాస్ హౌస్ లోని కంటెస్టెంట్స్.. ఫ్యామిలీ మెంబర్స్ ..ఫ్రెండ్స్ ను ఈవారం ఎపిసోడ్ లో తీసుకొచ్చారు. ఈ క్రమంలోని ఇనయా కోసం వచ్చిన సోహెల్.. శ్రీహన్ కొంప కొల్లేరు చేసాడు. మనకు తెలిసిందే సిరి-శ్రీహాన్ ప్రేమించుకుంటున్నారు. ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటారు. కాగా ఇలాంటి టైంలో సోహెల్.. శ్రీహాన్ పై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి .

ఇనయా కోసం హౌస్ లోకి వచ్చిన సోహెల్ సరదాగా మాట్లాడుతూ..” శ్రీహన్ వైపుగా వైపు టర్న్ అయ్యాడు . ఈ క్రమంలోనే కూకట్ పల్లిల్లో.. సిరి బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు శ్రీహాన్ ఎక్కువగా కనిపించేవాడని చెప్పుకొచ్చాడు. అక్కడ ఓ అమ్మాయితో తరచూ కాఫీ షాప్ లో నేను చూశానని చెప్పుకొచ్చాడు . దీంతో ఆ విషయాన్ని కవర్ చేసే ప్రయత్నం చేసిన శ్రీహాన్ కి.. మరో మైండ్ బ్లోయింగ్ షాక్ ఇచ్చాడు. కేవలం ఆ అమ్మాయితోనే కాదని ..సిరి బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు.. శ్రీహాన్ వేరే అమ్మాయితో టూర్ కూడా వెళ్లాడని.. ఒకవేళ బిగ్ బాస్ లో గాని సిరి లేకుండా ఉంటే కచ్చితంగా వీడియో కాల్ చేసి ప్రూవ్ చేసేదని చెప్పుకోచ్చాదు. దీంతో తడబడి శ్రీహాన్ అతనికి దండం పెట్టేసి.. ఆ మ్యాటర్ ని క్లోజ్ అయ్యేలా చేశాడు . దీంతో శ్రీహాన్ పేరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఎందుకు కూకట్ పల్లిలో శ్రీహాన్ తిరుగాడు..? ఆ రోజు ఏం జరిగింది ..? అంటూ సిరిని ట్రోల్ చేస్తున్నారు జనాలు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news