Moviesల‌వ్‌టుడే దెబ్బ‌కు మారేడుమిల్లి గిల‌గిలా... అల్ల‌రోడికి చుక్క‌లు క‌న‌ప‌డ్డాయ్‌...!

ల‌వ్‌టుడే దెబ్బ‌కు మారేడుమిల్లి గిల‌గిలా… అల్ల‌రోడికి చుక్క‌లు క‌న‌ప‌డ్డాయ్‌…!

టాలీవుడ్‌లో న‌వంబ‌ర్ నెలంతా టాలీవుడ్‌ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర చాలా డ‌ల్ వాతావ‌ర‌ణ‌మే ఉంది. టాక్ బాగున్న సినిమాల‌కు కూడా క‌లెక్ష‌న్లు రాలేదు. అయితే ఒక్క డ‌బ్బింగ్ సినిమా కాంతారా మాత్ర‌మే మంచి వ‌సూళ్లు రాబ‌ట్టినా అది కూడా అన్ని థియేట‌ర్ల‌కు కావాల్సినంత ఫీడ్ ఇవ్వలేదు. ఇక ఈ వారం మూడు సినిమాలు వ‌చ్చాయి. అందులో ఒక‌టి స్ట్రైట్ సినిమా.. రెండు డ‌బ్బింగ్ సినిమాలు. అల్ల‌రి న‌రేష్ నాంది త‌ర్వాత ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఆనంది హీరోయిన్‌.

ఇక ఒక‌టి కోలీవుడ్ డ‌బ్బింగ్ సినిమా ల‌వ్‌టుడే. దీనిని తెలుగులో దిల్ రాజు రిలీజ్ చేస్తున్నారు. ఇక మ‌రో బాలీవుడ్ డ‌బ్బింగ్ మూవీ తోడేలును అల్లు అర‌వింద్ రిలీజ్ చేశారు. ఈ మూడు సినిమాల్లో డ‌బ్బింగ్ సినిమా ల‌వ్‌టుడే తెలుగు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పూర్తి ఆధిప‌త్యం చెలాయించింది. అస‌లు ఈ డామినేష‌న్ ఏ రేంజ్‌లో ఉందంటే కాస్తో కూస్తో మంచి టాకే వ‌చ్చినా తోడేలును జ‌నాలు ప‌ట్టించుకోనంత‌గా ఉంది.

ఇక స్ట్రైట్ సినిమా అయినా కూడా అల్ల‌రోడికి ఫ‌స్ట్ డేనే చుక్కులు చూపించేసింది ల‌వ్‌టుడే సినిమా. పైగా డ‌బ్బింగ్ సినిమాల‌కు ఎక్కువ థియేట‌ర్లు అంటూ వ‌స్తోన్న విమ‌ర్శ‌ల నేప‌థ్యంలో అల్ల‌రోడి మారేడుమిల్లి సినిమాకే ఎక్కువ థియేట‌ర్లు ఇచ్చారు. ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో నుంచే ల‌వ్‌టుడే దెబ్బ‌తో మారేడుమిల్లిని జ‌నాలు ప‌ట్టించుకోవ‌డం మానేశారు. అస‌లు క‌లెక్ష‌న్లు చూసినా కూడా న‌రేష్ సినిమాకు నాలుగైదు రెట్లు ఎక్కువుగా ల‌వ్‌టుడే వ‌సూలు చేసింది.

మారేడుమిల్లికి మిక్స్ డ్ రివ్యూలు రాగా… ల‌వ్‌టుడే సినిమాకు కంప్లీట్ పాజిటివ్ రివ్యూలు, పాజిటివ్ టాక్ వ‌చ్చింది. ఇక హైద‌రాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో క‌లెక్ష‌న్లు చూస్తే అల్ల‌రోడికి ల‌వ్‌టుడే ఏ రేంజ్‌లో చుక్క‌లు చూపించిందో తెలుస్తుంది. సుదర్శన్ థియేటర్లో శుక్రవారం సెకండ్ షోకు ల‌వ్‌టుడే 1.21 ల‌క్ష‌ల గ్రాస్ వ‌సూళ్లు రాబ‌ట్టింది. అక్క‌డే ఉన్న దేవి థియేట‌ర్లో మారేడుమిల్లికి కేవ‌లం 18 వేల గ్రాస్ వ‌చ్చింది.

ఇక సంధ్య థియేట‌ర్లో తోడేలుకు కేవ‌లం రు. 15 వేల గ్రాస్ వ‌చ్చింది. అంటే ఈ రెండు సినిమాల వ‌సూళ్లు క‌లిపి చూసినా కూడా ల‌వ్‌టుడే వ‌సూళ్ల‌లో కేవ‌లం నాలుగో వంతు మాత్ర‌మే ఉన్నాయి. దీనిని బ‌ట్టి ల‌వ్‌టుడే దూకుడు ఎలా ఉందో అర్థ‌మ‌వుతోంది. ఏదేమైనా ల‌వ్‌టుడే మ‌రో వారం, ప‌ది రోజుల పాటు టాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేయ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news