Moviesదెబ్బ‌తో వాళ్ల నోళ్లు మూయించేశాడు... బాల‌య్య దెబ్బ‌కు థింకింగ్ మారిపోవాలే...!

దెబ్బ‌తో వాళ్ల నోళ్లు మూయించేశాడు… బాల‌య్య దెబ్బ‌కు థింకింగ్ మారిపోవాలే…!

కొన్నేళ్ల వ‌ర‌కు బాల‌కృష్ణ అంటే ఫ్యాన్స్‌ను విసుక్కుంటారు.. ఆయ‌న ద‌గ్గ‌ర‌కు వెళితే కొడ‌తారు.. బాల‌య్య కోపం ఎక్కువ.. ఇలా ఏవేవో ర‌క‌ర‌కాల కామెంట్లు ఆయ‌న‌పై వినిపించేవి. అయితే బాల‌య్య‌ను ద‌గ్గ‌ర‌గా చూడ‌ని వారే ఈ కామెంట్లు ఎక్కువుగా చేసేవారు. బాల‌య్య‌ను ద‌గ్గ‌ర నుంచి చూసి.. ఆయ‌న మ‌న‌స్త‌త్వం నిజంగా తెలిసిన వారెవ్వ‌రు బాల‌య్య‌పై ఏనాడు చిన్న విమ‌ర్శ‌లు కూడా చేయ‌రు. అదంతా గ‌తం ఇప్పుడు బాల‌య్య గురించి అంద‌రికి ఓపెన్ అయిపోయింది. బాల‌య్య మ‌న‌స్త‌త్వం ఏంటో చిన్న పిల్లాడికి తెలిసిపోయింది.

బాల‌య్య అంటే నిజంగా బాలుడే.. ఆయ‌న భోళామ‌నిషే అని ప్ర‌తి ఒక్క‌రు మెచ్చుకుంటున్నారు. ఇక ఇప్పుడు ఎక్క‌డ చూసినా బాల‌య్య నామ‌స్మ‌ర‌ణే మోగుతోంది. గ‌తేడాది అఖండ‌, అన్‌స్టాప‌బుల్ షోతో బాల‌య్య వెండితెర‌తో పాటు ఇటు బుల్లితెర‌పై సైతం విజృంభించాడు. అస‌లు ఒక‌ప్పుడు సోష‌ల్ మీడియాలో ఎక్కువుగా నెగ‌టివ్ ట్రెండ్ న‌డిచేది. అస‌లు ఇప్పుడు ఎక్క‌డ చూసినా ఆ నెగ‌టివ్ ట్రెండ్ అన్దే లేదు. కంప్లీట్‌గా ఈ త‌రం జ‌న‌రేష‌న్ వాళ్ల‌లో కూడా బాల‌య్య‌పై పూర్తి పాజిటివ్ ట్రెండ్ వ‌చ్చేసింది.

దెబ్బ‌కు థింకింగ్ మారిపోవాలా అన్న ట్యాగ్‌లైన్‌తో వ‌చ్చిన అన్‌స్టాప‌బుల్ షో దెబ్బ‌కు నిజంగానే బాల‌య్య త‌న ప‌ట్ల చాలా మందిలో ఉన్న థింకింగ్‌ను పూర్తిగా మార్చేశాడు. ఈ టాక్ షోలో బాలయ్య హోస్టింగ్‌ చూసిన వాళ్లంతా ఇన్ని రోజులు మనం విన్నది ఇతను గురించేనా ? బాలయ్య ఇంత సరదాగా ఉంటాడా ?ఇంత స్పాంటేనియస్ గా పంచులు వేస్తాడా ? చిన్న హీరోలు, పెద్ద హీరోలు అన్న తేడా లేకుండా ఇంత ఫ్రెండ్లీగా ఇంత కలుపుగోలుగా ఉంటాడా అని ఒక్కొక్కరు షాక్ అవుతున్నారు.

ఈ టాక్ షో తెలుగు బుల్లితెర టాక్ షోలలోనే సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోందంటే బాలయ్య మ్యాజిక్ ఎలా పనిచేస్తుందో ? అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం సీనియర్ హీరోలు అందరిలోనూ బాలయ్య అంటే ఆడియన్స్ లో విపరీతమైన పాజిటివ్ ఫీలింగ్ వచ్చేసింది. ఒకప్పుడు సినిమా వాళ్లు బాలయ్యను తమ సినిమాలకు స్పెషల్ గెస్టులుగా ఆహ్వానించింది లేదు.. అయితే ఇప్పుడు బాలయ్యను తమ సినిమాలకు స్పెషల్ గెస్ట్ లుగా పిలుస్తున్నారు. బాలయ్య వస్తే ఆయనది గోల్డెన్ లెగ్ అని.. తమ సినిమాకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుందని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి.

అన్‌స్టాప‌బుల్ టాక్ షోకు ముందు బాలయ్య బయటకు వచ్చి సినిమా ఫంక్షన్లలో మాట్లాడింది చాలా తక్కువ. అయితే ఇప్పుడు యంగ్ హీరోలను కూడా బాలయ్య చాలా బాగా ప్రమోట్ చేస్తూ వస్తున్నాడు. రీసెంట్‌గా అల్లు శిరీష్ నటించిన ఊర్వశివో రాక్షసివో ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌కు బాల‌య్య‌ గెస్ట్ గా వచ్చాడు. ఆ సినిమాకు మంచి టాక్ వచ్చింది. ఇక తాజాగా విశ్వక్సేన్ సొంత డైరెక్షన్లో చేస్తున్న దాస్ కా ధ‌మ్కీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు కూడా బాలయ్య ముఖ్యఅతిథిగా వచ్చి సందడి చేశాడు.

ఈ ఈవెంట్స్ లో బాలయ్య ఎనర్జీతో పాటు ఆయన పంచులు స్పీచ్ లు కుర్రకారును కూడా బాగా ఆకట్టుకుంటున్నాయి. అసలు చిన్న హీరోలు, పెద్ద హీరోలు అన్న తేడా లేకుండా ఎవరు పిలిచినా బాలయ్య ప్రతి ఒక్కరి ఈవెంట్ కు వెళుతూ… అందరి హీరోల అభిమానుల మనసులను కూడా గెలుచుకుంటున్నాడు. ఏదేమైనా ప్రస్తుతం బాలయ్య క్యారీ చేస్తున్న ఈ పాజిటివ్ నెస్ అంతా కూడా భవిష్యత్తులో బాలయ్యకు అన్ని విధాల ఉపయోగపడడంతో పాటు.. ఆయన తర్వాత సినిమాల కలెక్షన్లపై బాగా ప్రభావం చూపనుందని ..అలాగే తనని విమర్శించే వాళ్లకి కూడా..తన క్రేజ్ తో నోర్లు మూయించేసాడు బాలయ్య అని అంటున్నారు నందమూరి ఫ్యాన్స్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news