Moviesముగ్గురు ముద్దుగుమ్మ‌ల ముద్దుల హీరో మ‌హేష్‌... పూజాహెగ్డే, శ్రీలీల‌, ర‌ష్మిక‌తో రొమాన్స్‌..!

ముగ్గురు ముద్దుగుమ్మ‌ల ముద్దుల హీరో మ‌హేష్‌… పూజాహెగ్డే, శ్రీలీల‌, ర‌ష్మిక‌తో రొమాన్స్‌..!

స‌ర్కారువారి పాట సినిమా త‌ర్వాత మ‌హేష్‌బాబు న‌టిస్తోన్న త్రివిక్ర‌మ్ సినిమాకు ఎప్పుడూ ఏదో ఒక అవాంత‌రం ఎదుర‌వుతూనే వ‌స్తోంది. దాదాపు ఆరేడు నెల‌లుగా ఈ సినిమా ఇంకా సెట్స్ మీద‌కు వెళ్ల‌లేదు. ఒక‌సారి క‌థ మ‌హేష్‌కు న‌చ్చ‌క పోవ‌డం.. త‌ర్వాత క‌థ‌లో మార్పులు.. ఆ త‌ర్వాత మ‌హేష్ త‌ల్లి ఇందిరాదేవి మృతి.. అన్నీ సెట్ అయ్యాయి అనుకుంటోన్న టైంలో మ‌హేష్ తండ్రి సూప‌ర్ స్టార్ కృష్ణ మృతి ఇలా వ‌రుస‌గా ఏదో ఒక బ్రేక్ ఈ సినిమాకు ప‌డుతూ వ‌స్తోంది.

అయితే త్వ‌ర‌లోనే ప‌ట్టాలు ఎక్క‌నున్న ఈ సినిమాలో హీరోయిన్ల‌ను త్రివిక్ర‌మ్ ఫైన‌లైజ్ చేసేశారు. త్రివిక్ర‌మ్ సినిమాలో సెకండ్ హీరోయిన్ పాత్ర‌కు కూడా ఛాన్స్ ఉంటుంది. ఈ సినిమాలో ఫ‌స్ట్ హీరోయిన్‌గా పూజాహెగ్డేను తీసుకున్నారు. పూజ‌.. మ‌హేష్‌తో ఇప్ప‌టికే మ‌హ‌ర్షి సినిమా చేసి హిట్ కొట్టింది. ఇక పూజ గ‌తంలో త్రివిక్ర‌మ్ సినిమాల్లో రెండుసార్లు న‌టించింది. త్రివిక్ర‌మ్ వ‌రుస‌గా మూడోసారి పూజ‌ను రిపీట్ చేస్తున్నాడు.

ఇప్పుడు మ‌హేష్ సినిమాలో మెయిన్ హీరోయిన్‌గా పూజ ఉంటుంది. సెకండ్ హీరోయిన్‌గా యంగ్ క్రేజీ బ్యూటీ శ్రీలీల‌ను తీసుకున్నారు. మ‌హేష్ స‌ర‌స‌న ఛాన్స్ అంటే ఈ సినిమాతో శ్రీలీల కెరీర్ ట‌ర్న్ తీసుకోవ‌డం ఖాయ‌మైన‌ట్టే..! పైగా అటు త్రివిక్ర‌మ్ డైరెక్ట‌ర్‌. ఇక ఈ సినిమాలో మాంచి ఊపు వ‌చ్చే ఓ ఐటెం సాంగ్ కూడా ప్లాన్ చేస్తున్నాడ‌ట మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్‌.

ఈ స్పెష‌ల్ సాంగ్‌కు ర‌ష్మిక మంద‌న్న పేరు ఫైన‌ల్ అయిపోయిన‌ట్టే..! ర‌ష్మిక ఇప్ప‌టికే మ‌హేష్‌కు జోడీగా స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమా చేసింది. ఏదేమైనా మ‌హేష్‌తో త్రివిక్ర‌మ్ ఫుల్ ఎంట‌ర్టైన్‌మెంట్ ప్లాన్ చేశాడు. ఖ‌లేజా త‌ర్వాత 12 ఏళ్ల గ్యాప్‌తో ఈ కాంబినేష‌న్ సెట్ అవుతోంది.

Latest news