Movies1 కాదు 2 కాదు..ఏకంగా 10..మహేశ్ బాబు సంచలన రికార్డ్..ఏకైక...

1 కాదు 2 కాదు..ఏకంగా 10..మహేశ్ బాబు సంచలన రికార్డ్..ఏకైక తెలుగు హీరో..!!

వావ్ ఇది నిజంగా సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు మంచి కిక్ ఎక్కించే వార్త నే చెప్పాలి . టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కి ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన పని తాను చూసుకుంటూ సైలెంట్ గా ఉండే మహేష్ బాబు అంటే సినీ ఇండస్ట్రీలోనే కాదు చాలామంది జనాలకి విపరీతమైన ఇష్టం .

రీసెంట్ గా సర్కారీ వారి పాట సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ను తన ఖాతాలో వేసుకున్న మహేష్ బాబు ..ప్రజెంట్ త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు తో ఓ సినిమా చేస్తున్నాడు . ఈ సినిమా పూర్తి అయిపోయిన వెంటనే దర్శకధీరుడు రాజమౌళితో మరో ప్రతిష్టాత్మక సినిమాను తెరకెక్కించే విధంగా అడుగులు వేస్తున్నారు . కాగా ఇలాంటి మూమెంట్లో మహేష్ బాబు అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించే న్యూస్ ఒకటి ఇండస్ట్రీలో వైరల్ గా మారింది.

నిజానికి సర్కారీ వారి పాట సినిమా ఫస్ట్ షోకి నెగటివ్ టాక్ వచ్చింది. మెల్లమెల్లగా ఆ నెగటివ్ కాస్త పాజిటివ్ టాక్ గా మారి ఆ తర్వాత 100 కోట్ల రూపాయలు అందుకునేసింది . ఇక ఓవర్సీస్ లో మహేష్ బాబు స్టార్ స్టేటస్ గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంది.. అందరికీ తెలిసిందే ..సూపర్ స్టార్ మహేష్ బాబు కి ఓవర్సీస్ లో మంచి మార్కెట్ ఉంది . కాగా మహేష్ బాబు నటించిన సినిమాలలో ఒక్క బిజినెస్ మాన్ తప్పిస్తే మిగతా అన్ని సినిమాలు వన్ మిలియన్ మార్కుని అలవోకగా దాటేస్తాయి.

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ,వన్ నేనొక్కడినే, ఆగడు శ్రీమంతుడు ,బ్రహ్మోత్సవం ,స్పైడర్ ,భరత్ అనే నేను ,మహర్షి సరిలేరు నీకెవ్వరు ,సర్కారు వారి పాట ఇలా వరుసగా పది సినిమాలు 1 మిలియన్ మార్కులు అందుకున్నాయి. టాలీవుడ్ లో ఏ హీరోకి సాధ్యపడని రికార్డును క్రియేట్ చేశాడు మహేశ్. అంతే కాదు టాలీవుడ్ నెం 1 హీరో అని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news