Moviesఅన‌కాప‌ల్లి టు అమెరికా, ఆస్ట్రేలియా బాల‌య్య క్రేజ్ మామూలుగా లేదే...!

అన‌కాప‌ల్లి టు అమెరికా, ఆస్ట్రేలియా బాల‌య్య క్రేజ్ మామూలుగా లేదే…!

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌కు రీసెంట్ టైమ్స్‌లో పాపులారిటీ మామూలుగా లేదు. 60 ఏళ్లు పైబ‌డిన వారిలో ర‌జ‌నీకాంత్‌, చిరంజీవి లాంటి వాళ్ల క్రేజ్ త‌గ్గుతోన్న వాతావ‌ర‌ణం ఉంటే బాల‌య్య క్రేజ్ రెట్టింపు అయిపోతోంది. అనూహ్యంగా బాల‌య్య ఈ త‌రం జ‌న‌రేష‌న్‌కు కూడా పిచ్చ‌గా క‌నెక్ట్ అయిపోతున్నాడు. తాజాగా బాల‌య్య మ‌లినేని గోపీచంద్ ద‌ర్శ‌కత్వంలో వీర‌సింహారెడ్డి సినిమాలో న‌టిస్తున్నాడు. శృతీహాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది.

 

 

ఇక అన్‌స్టాప‌బుల్ సీజ‌న్ 2 కూడా స్టార్ట్ అయ్యింది. ఇప్ప‌టికే ఓటీటీలో స్ట్రీమింగ్ అయిన చంద్ర‌బాబు, లోకేష్ ఎపిసోడ్‌తో పాటు యంగ్ హీరోల ఎపిసోడ్ కూడా బాగా పేలింది. మూడో ఎపిసోడ్ ప్రోమోనే దుమ్ము రేపేసింది. సోష‌ల్ మీడియాలో యేడాదిన్న‌ర క్రింద‌ట వ‌ర‌కు బాల‌య్య‌ను బాగా ట్రోల్స్ చేసే వాళ్లు కూడా ఇప్పుడు బాల‌య్య నామ‌స్మ‌ర‌ణ చేస్తున్నారు. ఇప్పుడు బాల‌య్యకు విదేశాల్లోనూ క్రేజ్ అనూహ్యంగా పెరిగిపోతోంది.

 

బాల‌య్య సినిమాల‌ను ఓవ‌ర్సీస్ వాళ్లు నెత్తిన పెట్టుకుంటున్నారు. అఖండ అమెరికాలో అరాచ‌కం క్రియేట్ చేసింది. ఇక వీర‌సింహారెడ్డి సినిమాకు కూడా అక్క‌డ భారీ ప్రి రిలీజ్ బిజినెస్ జ‌రుగుతోంది. ఇక దుబాయ్‌లోనూ బాల‌య్య సినిమాల‌కు మంచి క్రేజ్ ఏర్ప‌డింది. అటు ఆస్ట్రేలియాలోనూ బాల‌య్య క్రేజ్ ఊపేస్తోంది. రీసెంట్‌గా ఆస్ట్రేలియాలో బంగ్లాదేశ్ – ఇండియా మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్‌లో బాల‌య్య ఫ్యాన్స్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు.

ఈ మ్యాచ్‌లో బాల‌య్య ఫ్యాన్స్ కింగ్ కోహ్లీ, వీర‌సింహారెడ్డి పోస్ట‌ర్స్ క‌లిపి ఉండేలా చేసి నానా హంగామా చేశారు. ఈ ఫోటో బాగా వైర‌ల్ అయ్యింది. ఈ ఫొటో వీర‌సింహారెడ్డి డైరెక్ట‌ర్ మ‌లినేని గోపీచంద్ వ‌ర‌కు రాగా ఆ పిక్‌ను షేర్ చేసి ఎగ్జైట్మెంట్ వ్య‌క్తం చేశాడు. ఈ మాస్ పోస్ట‌ర్ ఇప్పుడు బాగా వైర‌ల్ అవుతోంది. మైత్రీ వాళ్లు నిర్మిస్తోన్న ఈ సినిమాకు థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నాడు.

 

 

Latest news