Moviesఫరియా తల రాతను మార్చేసిన ఆ తెలుగు హీరో ఎవరో తెలుసా..అస్సలు...

ఫరియా తల రాతను మార్చేసిన ఆ తెలుగు హీరో ఎవరో తెలుసా..అస్సలు నమ్మలేరు..!!

ఫరీయా అబ్దుల్లా ..ఈ పేరు చెప్తే జనాలకు అస్సలు గుర్తు రాదు. ఎవరు ఈ అమ్మాయి అంటూ కొద్దిసేపు ఆలోచించుకోవడానికి టైం తీసుకుంటారు. అదే చిట్టి అంటే మాత్రం వెంటనే గుర్తుపట్టేస్తారు . అంతలా తన ఒరిజినల్ పేరు కన్నా సినిమాలోని పేరుతో పాపులారిటీ దక్కించుకుంది ఈ హైదరాబాది హీరోయిన్ ఫరీయ అబ్దుల్లా. సినిమాలోకి రాకముందు పలు షార్ట్ ఫిలిం లో ..వెబ్ సిరీస్ లో కనిపించినా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది .

కానీ జాతి రత్నాలు అనే సినిమా ద్వారా ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ లిస్టులోకి యాడ్ అయిపోయింది . ఈ సినిమాలో చిట్టి పెర్ఫార్మెన్స్ చూసిన ప్రతి ఒక్కరు కడుపుబ్బ నవ్వుకున్నారు . అందరి హీరోయిన్స్ ఎక్స్పోజింగ్ చేసి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంటే ..ఫరీయా అబ్దుల్లా మాత్రం నవ్వులు పూయించే పంచులు వేసి మరి ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది . ఇప్పటికి ఫరీయా అబ్దుల్లా అంటే అందరి జనాలకి చాలా ఇష్టం. అంతలా తన నిర్మలమైన స్మైల్ తో ఆకట్టుకుంటుంది .

రీసెంట్గా “లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ” అనే సినిమా ద్వారా ఆడియన్స్ ముందుకొచ్చింది ఫరీయా అబ్దుల్లా. ఈ సినిమా ఎవరు ఊహించిన విధంగా హ్యూజ్ పాజిటివ్ టాక్ సంపాదించుకుంది . ఫుల్ లెంత్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా జనాలకు బీభత్సంగా నచ్చేసింది . అయితే జాతి రత్నాలు సినిమా తర్వాత ఫరీయా అబ్దుల్లా రెండు మూడు సినిమాల్లో నటించింది. ఈ సినిమాలు ఆమెకు మంచి పేరు తీసుకురాలేకపోయాయి . అయితే “లైక్ షేర్ అండ్ సబ్స్క్రయిబ్ ” మాత్రం జనాలను ఆకట్టుకుంటుంది. దీని అంతటికి కారణం ప్రభాస్ అంటున్నారు జనాలు . జాతి రత్నాలు సినిమా ట్రైలర్ రిలీజ్ చేసింది ప్రభాస్ నే.. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు ఈ లైక్ షేర్ సబ్స్క్రయిబ్ ట్రైలర్ రిలీజ్ చేసింది ప్రభాస్.. ఇలా ప్రభాస్ ఫరీయా అబ్దుల్లా సినిమా కెరియర్ కి ప్రభాస్ తో విడతీయరాని అనుబంధం ఉంది అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news