Moviesదేవిశ్రీ చిరును నిలువునా ముంచేశాడా... ఆశ‌ల‌న్నీ అడియాస‌లు...!

దేవిశ్రీ చిరును నిలువునా ముంచేశాడా… ఆశ‌ల‌న్నీ అడియాస‌లు…!

ఎస్ ఇప్పుడు ఇదే మాట అంద‌రి నోటా ఇండ‌స్ట్రీలో విన‌ప‌డుతోంది. అస‌లు దేవీ ఇటీవ‌ల ప‌నిపై దృష్టి పెట్ట‌డం లేద‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి. అస‌లు స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమాకు ఇచ్చిన ఆల్బ‌మ్ చూసి మ‌హేష్‌కే మైండ్ బ్లాక్ అయిపోయింది. అంత నిస్సార‌మైన ఆల్బ‌మ్ మ‌హేష్ కెరీర్ మొత్తం మీద లేద‌ని మ‌హేష్ అభిమానులు నోరెళ్ల బెట్టేశారు. అస‌లు మ‌హేష్ కూడా ప్రి రిలీజ్ ఈవెంట్‌లో దేవి పేరు త‌ల‌చేందుకు కూడా ఏ మాత్రం ఇష్ట‌ప‌డ‌లేదు.

అల వైకుంఠ‌పురంలో సినిమాతో పోటీ ప‌డిన స‌రిలేరు కేవ‌లం మ్యూజిక్ దెబ్బేయ‌డంతో వీక్ అయ్యింది. మ‌ధ్య‌లో దేవీ ప‌నైపోయింద‌నుకున్నారు. అయితే పుష్ప‌తో కాస్త పుంజుకున్నాడు. పుష్ప‌కు ఎంత మంచి మ్యూజిక్ ఇచ్చినా కూడా అఖండకు థ‌మ‌న్‌కు వ‌చ్చినంత పేరు అయితే రాలేదు. స‌రిలేరుతో మ‌హేష్‌కు ఎంత దెబ్బేశాడో.. ఇక ఇప్పుడు అదే దెబ్బ మెగాస్టార్‌కు కూడా రుచి చూపించ‌బోతున్నాడా ? అన్న సందేహాలు అంద‌రికి వ‌చ్చేశాయి.

అస‌లు లేటెస్ట్ వాల్తేరు వీర‌య్య సాంగ్ వ‌చ్చింది. పాట‌, ట్యూన్‌, ప‌దాలు ఏ మాత్రం క్యాచీగా, ఇంట్ర‌స్టింగ్‌గా లేవు. బాసొచ్చిండు అంటూ దేవీ ఓవ‌ర్ యాక్ష‌న్ మితిమీరి పోయి క‌నిపించిందే త‌ప్పా పాట‌లో అయితే ద‌మ్ములేద‌నే అంటున్నారు. దేవి రాసుకుని.. దేవి మ్యూజిక్ కంపోజ్ చేసుకుని.. దేవీనే పాడిన పాట ఇది.. చివ‌ర‌కు దేవీ ఒక్క‌డే వినేలా ఉంద‌న్న సెటైర్లు కూడా ప‌డుతున్నాయి.

దేవీ ఈ మ‌ధ్య ఫామ్‌లో లేడు. ఒక‌ప్పుడు థ‌మ‌న్‌ను అంద‌రూ ఆడేసుకునే వాళ్లు. అయితే గ‌త రెండేళ్లుగా థ‌మ‌న్ దూకుడు ముందు దేవీ క‌నీసం పోటీ ఇవ్వ‌లేని ప‌రిస్థితి. చిరంజీవికి కూడా ర‌క‌ర‌కాల ఆబ్లిగేష‌న్ల నేప‌థ్యంలో దేవీయే కావాలి. కానీ దేవి అందివ‌చ్చిన అవ‌కాశం చేజేతులా నాశ‌నం చేసుకున్న‌ట్టే ఉంది. ట్యూన్ పేలిపోవాలంటే త‌న కాన్‌సంట్రేష‌న్ త‌న‌కు ఉండాలి. కొత్త‌గా ఆలోచించాలి.. ట్యూన్ కొత్త‌గా రాయించాలి.. కంపోజింగ్ కొత్తగా ఉండాలి.. అంతేకాని అన్నింట్లోనూ తానే దూరేస్తాన‌ని అంటే ఇలాగే మొహం మొత్తేస్తాయి.

ఓవ‌రాల్‌గా ఫ‌స్ట్ సాంగ్‌తో సినిమాకు హైప్ ఏమోగాని కావాల్సినంత నెగ‌టివిటి అయితే స్టార్ట్ అయ్యింది. మ‌రి మిగిలిన సాంగ్స్‌తో పాటు రేపు థియేట‌ర్ల‌లో బీజీఎం చూశాక చిరును దేవి ముంచుతాడా ? తేల్చుతాడా ? అన్న‌ది చూడాలి. ఇక బాసొచ్చాడు సాంగ్ కంటే ఆర్ట్ డైరెక్ట‌ర్ ప్ర‌కాష్ వేసిన సెట్ బాగుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news