Moviesసూప‌ర్‌స్టార్ కృష్ణ మృతి... బుర్రిపాలెం బుల్లోడు జీవితంలో ముఖ్య‌ఘ‌ట్టాలు ఇవే....!

సూప‌ర్‌స్టార్ కృష్ణ మృతి… బుర్రిపాలెం బుల్లోడు జీవితంలో ముఖ్య‌ఘ‌ట్టాలు ఇవే….!

సీనియ‌ర్ న‌టుడు, ప్ర‌ముఖ సూప‌ర్‌స్టార్ కృష్ణ మృతిచెందారు. ఆదివారం అర్ధ‌రాత్రి కార్డియాక్ అరెస్టుకు గురైన ఆయ‌నను కుటుంబ స‌భ్యులు గ‌చ్చిబౌలిలోని కాంటినెంట‌ల్ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. చికిత్స పొందుతూ మంగ‌ళ‌వారం ఉద‌యం మృతిచెందారు. కృష్ణ మృతితో ఆయ‌న కుటుంబ స‌భ్యులు మాత్ర‌మే కాదు… అభిమానులు కూడా శోక‌సంద్రంలో మృతిచెందారు. 1942 మే 31న గుంటూరు జిల్లా తెనాలి తాలూకా బుర్రిపాలెంలో జ‌న్మించారు. వీర‌రాఘ‌వ‌య్య చౌద‌రి, నాగ‌ర‌త్నం దంప‌తుల‌కు ఆయ‌న జ‌న్మించారు.

ఆయ‌న ఏలూరులోని సీఆర్ రెడ్డి కాలేజ్‌లో చ‌దివారు. కృష్ణ అస‌లు పేరు ఘ‌ట్ట‌మ‌నేని శివ‌రామ కృష్ణ‌మూర్తి. ఆయ‌న‌కు చిన్న‌ప్ప‌టి నుంచే సినిమాల ప‌ట్ల ఆస‌క్తి ఎక్కువ‌. అయితే తల్లిదండ్రులు మాత్రం ఆయ‌న్ను ఇంజ‌నీరింగ్ చ‌దివించాల‌న్న కోరిక‌తో ఉండేవారు. ఇంజ‌నీరింగ్‌లో సీటు దొరక్క‌పోవ‌డంతో ఆయన ఏలూరు సీఆర్ రెడ్డి కాలేజ్‌లో డిగ్రీలో చేరారు. ఆయ‌నకు అక్క‌డ ముర‌ళీమోహ‌న్ క్లాస్‌మేట్‌, బెంజ్‌మేట్ కూడా…!

ఆయ‌న అక్క‌డ చ‌దువుతున్న‌ప్పుడే ప్ర‌ముఖ న‌టుడు అక్కినేని నాగేశ్వ‌ర‌రావుకు స‌న్మానం జ‌రిగింది. అక్క‌డ నుంచే ఆయ‌న‌కు సినిమాల‌పై ఆస‌క్తి ఏర్ప‌డింది. ఆయ‌నకు త‌న మ‌ర‌ద‌లు అయిన ఇందిరాదేవితో 1965లో వివాహం జ‌రిగింది. వీరికి ఐదుగురు సంతానం. ముగ్గురు అమ్మాయిలు, ఇద్ద‌రు అబ్బాయిలు. అబ్బాయిల్లో సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు, ర‌మేష్‌బాబు. ఇక అమ్మాయిల్లో ఇందిరా ప్రియ‌ద‌ర్శిని, ప‌ద్మావ‌తి, మంజుల‌.

ఆ త‌ర్వాత కృష్ణ త‌న కోస్టార్ అయిన విజ‌య‌నిర్మ‌ల‌ను రెండో వివాహం చేసుకున్నారు. ఆమెకు కూడా ఇది రెండో వివాహం. అప్ప‌టికే ఆమెకు మొద‌టి భ‌ర్త‌తో న‌రేష్ ఉన్నాడు. న‌టుడు జ‌గ్గ‌య్య‌, చ‌క్ర‌పాణి, గుమ్మ‌డి కూడా తెనాలి ప్రాంతానికే చెందిన వారు కావ‌డంతో… ముందు ప్ర‌జా నాట్య‌మండ‌లిలో చేరి నాట‌కాల‌పై అవ‌గాహ‌న పెంచుకున్న కృష్ణ ఆదుర్తి సుబ్బారావు ద‌ర్శ‌క‌త్వంలో 1965లో వ‌చ్చిన తేనేమ‌న‌సులు సినిమాతో వెండితెర‌కు ప‌రిచ‌యం అయ్యారు. ఇక అక్క‌డ నుంచి ఆయ‌న వెన‌క్కు తిరిగి చూసుకోలేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news