Moviesబిగ్ బ్రేకింగ్: హీరో కమల్ హాసన్‌కి తీవ్ర అస్వ‌స్థ‌త‌..హస్పిటల్ కి తరలింపు..!!

బిగ్ బ్రేకింగ్: హీరో కమల్ హాసన్‌కి తీవ్ర అస్వ‌స్థ‌త‌..హస్పిటల్ కి తరలింపు..!!

ప్రముఖ నటుడు కమల్ హాసన్ అస్వస్థతకు గురైనట్లు సోషల్ మీడియాలో వార్తలు ఆధారంగా తెలుస్తుంది. మల్టీ టాలెంట్ కమలహాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన నటనతో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్న ఈయన ప్రజెంట్ తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూనే ..స్ తమిళ్ బిగ్ బాస్ కి హోస్టుగా చేస్తున్నారు. అంతేకాదు రీసెంట్ గానే విక్రమ్ సినిమాతో హ్యూజ్ బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న కమలహాసన్ ..నెక్స్ట్ సినిమాలను సైతం అదే విధంగా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు .

కాగా రీసెంట్గా కమలహాసన్ చేసిన ఫోటోషూట్ కూడా సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్గా మారింది. ఇంత వయసు వచ్చిన ఇంకా చలాకిగా ఎగురుతూ.. గంతులు వేస్తూ.. కుర్రాడులా ఉన్నారు అంటూ కామెంట్స్ వినిపించాయి. కాగా ఇలాంటి క్రమంలోనే కమలహాసన్ హాస్పిటల్ లో అడ్మిట్ అవ్వడం చాలా బాధను కలిగిస్తుంది.

అంతున్న సమాచారం ప్రకారం కమల్ హాసన్ కి గత మూడు రోజుల నుంచి తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారట. అంతేకాదు శ్వాస తీసుకోవడంలోనూ ఇబ్బంది పడుతున్నారట. ఈ క్రమంలోనే ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో కుటుంబ సభ్యులు అతని ని హాస్పిటల్ కి తరలించినట్లు కోలీవుడ్ మీడియా చెప్పుకొస్తుంది . ప్రస్తుతం కమల్ హాసన్ పోరూర్ రామచంద్ర హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. కాగా కమల్ ఆరోగ్యం పరిస్థితికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news