Moviesతెలుగు తెరపై మరో కన్నడ సోయగం.. నందమూరి హీరోకి జోడీగా హాట్...

తెలుగు తెరపై మరో కన్నడ సోయగం.. నందమూరి హీరోకి జోడీగా హాట్ బ్యూటి..!!

తెలుగు చలనచిత్ర పరిశ్రమ చాలా విశాలమైనది . ఎంత విశాలమైనది అంటే ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఎన్నో ఆశలతో హీరోయిన్ అవదామని ట్రై చేసిన తెలుగు ముద్దుగుమ్మలను మాత్రం హీరోయిన్గా ఎంకరేజ్ చేయరు. ఎక్కడో పుట్టి.. ఎక్కడో పెరిగి.. తెలుగు భాష లోకి వచ్చి ఇండస్ట్రీని ఏలేసే హీరోయిన్స్ కి మాత్రం కోట్లకు కోట్లు పోసి మరి అవకాశాలు ఇస్తుంది. అదేంటో ఇప్పటికి అర్థం కాదు. మన తెలుగు ముద్దుగుమ్మల దగ్గర లేనిది పరాయి ఇండస్ట్రీలో ఉన్న ముద్దుగుమ్మల దగ్గర ఉన్నది ఏంటో వాళ్లకే తెలియాలి .

కాగా ఇప్పటికే సినీ ఇండస్ట్రీని సగానికి పైగా ఆక్రమించేసిన కన్నడ ముద్దుగుమ్మలు రానున్న రోజుల్లో పూర్తిగా ఆక్రమించేయనున్నారని తెలుస్తుంది. దానికి మరో ఉదాహరణ ఆశికా రంగనాథ్. కన్నడ బ్యూటీ అయిన ఈ అమ్మడు తెలుగులో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతుంది . ఇప్పటికీ కన్నడ ఇండస్ట్రీ నుంచి పూజ హెగ్డే ,రష్మిక ,కృత్తి శెట్టి ,అనుష్కలాంటి హీరోయిన్స్ ఎంతోమంది వచ్చారు . కాగా ఇప్పుడు ఆ లిస్టులోకే చేరిపోయింది ఆశికా .

ఇప్పటికే ప్రభాస్ – మారుతి డైరెక్షన్ రాబోతున్న సినిమాలో హీరోయిన్గా చేస్తున్న ఆశిక రంగనాథ్ ..ఇప్పుడు నందమూరి హీరోతో నటించిన ఛాన్స్ కొట్టేసింది . నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ప్రస్తుతం చేస్తున్న సినిమా ద్వారా ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకులను పలకరించబోతుంది . కళ్యాణ్ రామ్ హీరోగా రాజేందర్ రెడ్డి ..అమిగోస్ అనే సినిమాలో చేయబోతున్న సంగతి తెలిసిందే . రీసెంట్ గానే దీనికి సంబంధించిన పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. కాగా ఈ సినిమాలో అశికా సెలెక్ట్ అయింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ఆశిక రంగనాథ్ హాట్ అందాలతో ఆలోచించబోతున్నట్లు తెలుస్తుంది . ఏది ఏమైనా సరే ఇలా వరుసగా కన్నడ బ్యూటీలు తెలుగు లో అవకాశాలు దక్కించుకోవడం ఓ మంచి విషయం అయినా మన తెలుగు ముద్దుగుమ్మలను పట్టించుకోకపోవడం మరింత దారుణం అంటున్నారు జనాలు . చూద్దాం ఆశిక రంగనాథ్ ఏ మేరా సక్సెస్ అవుతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news