Moviesకూతురు కోసం అల్లు అర్జున్ సంచలన నిర్ణయం.. ప్రతి తండ్రి చేయాల్సిన...

కూతురు కోసం అల్లు అర్జున్ సంచలన నిర్ణయం.. ప్రతి తండ్రి చేయాల్సిన గొప్ప పని..!!

ప్రతి కూతురికి ఆమె ఫస్ట్ హీరో తన తండ్రి నే. ఎస్ ఇప్పటికీ ఎప్పటికీ ఈ ఫార్ములా చెరిగిపోదు చెరగనివ్వరు . కాగా అన్ని బంధాలలో కల్లా తండ్రి కూతుర్ల రిలేషన్షిప్ చాలా కొత్తగా ఉంటుంది. ఎప్పటికప్పుడు సరికొత్త విధంగా మలుచుకుంటూ ఫ్రెష్ ఫీలింగ్ కలగజేస్తుంది. కాగా ప్రతి తండ్రి తన కూతురు భవిష్యత్తు కోసం తన కోరికల ని త్యాగం చేస్తాడు.

 

తను సంపాదించిన దాంతో సగానికి పైగా కూతురు భవిష్యత్తు కోసం దాచిపెట్టి ఆమెను హ్యాపీగా ఉంచాలని ట్రై చేస్తుంటారు. ప్రజెంట్ అలాంటి డెసిషన్ తీసుకున్న అల్లు అర్జున్ సోషల్ మీడియాలో ప్రశంసలు అందుకుంటున్నాడు . టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ ప్రజెంట్ పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు సంపాదించుకొని జనాలను అలరిస్తున్నాడు.

రీసెంట్గా పుష్ప సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న బన్నీ త్వరలోనే పుష్ప2 సినిమాతో మన ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు . కాగా సినిమా షూటింగ్లో ఎంత బిజీగా ఉన్నా సరే తన కూతురుతో ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వస్తారు అల్లు అర్జున్ . కాగా అల్లు అర్హా భవిష్యత్తు కోసం అల్లు అర్జున్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు ఓ న్యూస్ వైరల్ గా మారింది . ఏ తండ్రి చేయని విధంగా మొదటిసారి తన ఆస్తిపై పూర్తి హక్కులను కూతురికి వచ్చేలా అల్లు అర్జున్ వీలునామ రాయించుకున్నారట.

ఈ విషయం నెట్టింట లీక్ అవ్వదంతో అల్లు అర్జున్ అభిమానులు ఫుల్ ఫిదా అయిపోయారు . ఆడపిల్ల అంటే కుంపటి అని భావించే జనాలు ఉన్న ఈ రోజుల్లో నువ్వు చేసిన పని సూపర్ అంటూ మెచ్చుకుంటున్నారు. ఏది ఏమైనా సరే ప్రతి తండ్రి ఇలానే ఆలోచిస్తే ఆడపిల్ల భవిష్యత్తు ఫుల్ బిందాస్ గా ఉంటుంది అంటున్నారు అమ్మాయిలు…!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news