Moviesఆ స్టార్ డైరెక్ట‌ర్ కొడుకుతో అనుష్క ల‌వ్ ఎఫైర్ న‌డిపించిందా..? అస‌లేం...

ఆ స్టార్ డైరెక్ట‌ర్ కొడుకుతో అనుష్క ల‌వ్ ఎఫైర్ న‌డిపించిందా..? అస‌లేం జ‌రిగింది..?

కింగ్ నాగార్జున – పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్లో వ‌చ్చిన సూప‌ర్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ అనుష్క శెట్టి. మొదటి సినిమాతోనే అనుష్క కుర్రాళ్ల గుండెల్లో రైళ్లు ప‌రిగెత్తించింది. త‌న అందచందాల‌తో యూత్ ను ఫిదా చేసింది. నిజానికి యోగా టీచ‌ర్ అయిన అనుష్క అనుకోకుండా ఇచ్చిన ఆడిష‌న్ తో సూప‌ర్ సినిమాలో న‌టించే ఛాన్స్ ద‌క్కించుకుంది. సూప‌ర్ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ అవ్వ‌డంతో అనుష్క తిరిగి చూసుకోలేదు. ఆ త‌ర‌వాత వ‌రుస ఆఫ‌ర్లు అందుకుంది.

 

అంతే కాకుండా గ్లామ‌ర్ షో విష‌యంలో కూడా ఎక్క‌డా కాంప్ర‌మైజ్ అవ్వ‌లేదు. బిల్లా సినిమాలో అనుష్క బికినీ షాట్స్ కుర్రాళ్ల మ‌తిపోగ‌ట్టాయి. రీసెంట్ గా బిల్లా సినిమాను 4కే లో విడుద‌ల చేయ‌గా అనుష్క సోష‌ల్ మీడియాలో ట్రెండింగా మారింది. ఇక ప్ర‌స్తుతం అనుష్క సీనియ‌ర్ హీరోల సినిమాల్లో అవ‌కాశాలు వ‌చ్చినా న‌టించ‌కుండా దూరంగా ఉంటోంది. కేవ‌లం లేడీ ఓరియెంటెడ్ చిత్రాల‌లోనే న‌టిస్తూ ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తోంది. ఇదిలా ఉంటే అనుష్క 40కు వ‌స్తున్నా పెళ్లి మాత్రం చేసుకోలేదు.

టాలీవుడ్ లోని హీరోయిన్స్ లో పెళ్లి కాని లిస్ట్ తీస్తే అందులో మొద‌టగా అనుష్క పేరే క‌నిపిస్తుంది. కానీ ఈ బ్యూటీ పెళ్లి ఎఫైర్స్ టాపిక్ మాత్రం ఎప్పుడూ నెట్టింట హాట్ టాపిక్ గానే ఉంటుంది. గ‌తంలో ఈ ముద్దుగుమ్మ‌కు ఓ స్టార్ హీరోతో ఎఫైర్ ఉంద‌ని ఆ హీరో వ‌ల్ల‌నే సినిమా ఆఫ‌ర్లు వ‌స్తున్నాయ‌ని పుకార్లు వినిపించాయి. అంతే కాకుండా బాహుబ‌లి సినిమా త‌ర‌వాత ప్ర‌భాస్ తో అనుష్క ల‌వ్ ఎఫైర్ న‌డిపిస్తుంద‌ని త్వ‌ర‌లోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్త‌లు వైర‌ల్ అయ్యాయి.

ఈ వార్త‌లు చాలా కాలా పాటూ ఇండ‌స్ట్రీని షేక్ చేశాయి. దానికి కార‌ణం అనుష్క – ప్ర‌భాస్ సినిమా ఫంక్ష‌న్ ల‌లో చాలా క్లోజ్ గా క‌నిపించ‌డ‌మే. ఇదిలా ఉంటే ఆ మ‌ధ్య ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు త‌న‌యుడు ప్రకాష్ కోవెల‌మూడితో అనుష్క ల‌వ్ లో ఉందంటూ వార్త‌లు గుప్పుమ‌న్నాయి. త్వ‌ర‌లోనే ఇద్ద‌రూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ ప్ర‌చారం జ‌రిగింది.

అయితే అప్ప‌టికే ప్రకాష్ కు బాలీవుడ్ క‌థా ర‌చ‌యిత క‌నిక థిల్లాన్‌తో పెళ్లి జ‌ర‌గ్గా భార్య‌తో విడాకులు తీసుకున్నాడు. ఆ త‌ర‌వాత అనుష్క‌తో రెండో పెళ్లి అంటూ ఫిల్మీ దునియాలో టాక్ వినిపించింది. కానీ ఆ వార్త‌లు నిజం కాలేదు. అయితే అనుష్క ద‌ర్శ‌కేంద్రుడి కొడుకుతో క్లోజ్ గా ఉండ‌టం వ‌ల్లే ఆ వార్త‌లు వ‌చ్చాయ‌ని అన్నారు. ఇలా చాలా స్లార్లు అనుష్కపై పెళ్లి రూమ‌ర్లు వ‌చ్చాయి. మ‌రి స్వీటీని పెళ్లి చేసుకోబోయే అదృష్ట‌వంతుడు ఎవ‌రో ? చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news