Moviesఅప్పుడు రాజమౌళి.. ఇప్పుడు అల్లు అర్జున్.. తొక్కలో స్ట్రాటజీ..వర్క్ అవుట్ అయ్యేనా..?

అప్పుడు రాజమౌళి.. ఇప్పుడు అల్లు అర్జున్.. తొక్కలో స్ట్రాటజీ..వర్క్ అవుట్ అయ్యేనా..?

ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ గా మారింది . దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫుల్ ఫిదా అయిపోతుంటే..ఆయన అంటే పడని వాళ్లు మాత్రం కుళ్లు కుంటున్నారు. మనకు తెలిసిందే గత ఏడాది సెప్టెంబర్ 17న పాన్ ఇండియా లెవెల్ లో పుష్ప సినిమాతో హిట్ కొట్టిన అల్లు అర్జున్.. ప్రజెంట్ పుష్ప2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు . అందుతున్న సమాచారం ప్రకారం పుష్ప2 సినిమాని సమ్మర్ కానుకగా రిలీజ్ చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నారట.

కాగా ఈసారి ఎవరు ఊహించని విధంగా పుష్ప2 సినిమాను రష్యాలో కూడా రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు అల్లు అర్జున్ . ఎస్ ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతుంది. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమాను జపాన్ లో రిలీజ్ చేసి తెలుగు సినిమా పవర్ ఏంటో చాటి చెప్పిన రాజమౌళి ఆదర్శంగా తీసుకున్న అల్లు అర్జున్ తన సినిమాని రష్యాలో రిలీజ్ చేయడానికి ట్రై చేస్తున్నాడట. అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప2 రైస్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. గత సెప్టెంబర్ నెలలో ఈ సినిమాని ఇంగ్లీష్ అలాగే రష్యన్ సబ్ టైటిల్స్ తో మాస్కో ఫిలిం ఫెస్టివల్ ప్రదర్శించారు . ఈ క్రమంలోనే పుష్ప సినిమాకి అక్కడ ఫ్యూజ్ పాజిటివ్ రెస్పాన్స్ లభించింది .

ఈ క్రమంలోనే ఆ స్పందన చూసిన దర్శక నిర్మాతలు పుష్ప2 సినిమా విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది . పుష్ప 2 సినిమాని రష్యన్ భాషలో డబ్బింగ్ చేయించి భారీ ఎత్తున విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారట . అక్కడ రిలీజ్ కు అల్లు అర్జున్ స్వయంగా సుకుమార్ తో కలిసి వెళ్లి సినిమాను ప్రమోట్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే దీనిపై కొందరు హెటర్ మాత్రం అల్లు అర్జున్ ను ట్రోల్ చేస్తున్నారు . ముందు పుష్ప 2 సినిమాను ఇండియాలో సరిగ్గా చెప్పిన టైంకి రిలీజ్ చేసి ఆ తర్వాత మిగతా పార్టీల జోలికి వెళ్ళండి.

అప్పుడు మీ సినిమా సత్తా ఏంటో తెలుస్తుంది “అంటూ వ్యంగ్యంగా ట్రోల్ చేస్తున్నారు . ఈ మాటల అల్లు అర్జున్ అభిమానులకు కోపం తెప్పిస్తున్నాయి . అంతేకాదు ఆర్ఆర్ఆర్ అంటే మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ అది ఎలాగైనా సరే హిట్టవుతుంది ..పుష్ప సంగ్లింగ్ కి సంబంధించింది ఇలాంటి సినిమాను విదేశాలలో రిలీజ్ చేస్తే మన ఇండియన్స్ పరువు పోతుంది “అంటూ ట్రోల్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news