Moviesఅందుకే ఆ రెండు సినిమాలో అవకాశం ఇవ్వలేదు.. పవన్ పై అలీ...

అందుకే ఆ రెండు సినిమాలో అవకాశం ఇవ్వలేదు.. పవన్ పై అలీ షాకింగ్ కామెంట్స్..!!

సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు . పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు ,ప్రభాస్, గోపీచంద్, అల్లు అర్జున్ , సుకుమార్ చిరంజీవి , రాధిక ..ఇలా ఎంతోమంది తమ ఫ్రెండ్షిప్ ని కంటిన్యూ చేస్తున్నారు . అలాంటి వాళ్ళల్లో ఒకరే ఈ పవన్ కళ్యాణ్ ఆలీ. గతంలో వీరిద్దరి ఫ్రెండ్షిప్ అంటే జనాలకి బాగా ఇష్టం. ఎక్కువగా లైక్ చేశారు .

పవన్ కళ్యాణ్ నటించిన ప్రతి సినిమాలో ఆలి ఉండాల్సిందే. తనదైన స్టైల్ లో కామెడీ పండిస్తూ ..పవన్ ఆలీ మధ్య వచ్చే సీన్స్ ఇప్పటికీ కడుపుబ్బ నవ్విస్తాయి . తెరపైనే కాదు తెర వెనక కూడా అలీ పవన్ కళ్యాణ్ మంచి ఫ్రెండ్స్ . అయితే రాజకీయాల పుణ్యమా అంటూ వాళ్ళిద్దరూ విడిపోయారు మనకు తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టి ఆ పనిలో బిజీగా ఉంటే.. అలీ వైసీపీ పార్టీలో కంటిన్యూ అవుతున్నారు .

దీంతో సినిమా ఇండస్ట్రీ ఫ్రెండ్షిప్ పెంచితే రాజకీయం వాళ్ళిద్దర్నీ దూరం చేసింది అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు. కాగా ఈ క్రమంలోని ఆలీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. “మేము వ్యక్తిగతంగా మంచి ఫ్రెండ్స్ . చాలా మంది అడుగుతున్నారు. వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సినిమాలో మీరు ఎందుకు నటించలేదు అని..పవన్ మిమ్మల్ని ఎందుకు దూరం పెట్టారు అని ..ఆ రెండు సినిమాలు మీరు గమనించినట్లయితే పవన్ కళ్యాణ్ సీరియస్ లుక్ లోనే ఉంటాడు . పెద్దగా కామెడీ ఉండదు. నేనే కాదు వేరే ఎవరు కూడా ఆ సినిమాల్లో కమెడియన్స్ లేరు. అందుకే ఆ రెండు సినిమాలకు నా పేరు సజిస్ట్ చేయలేదు. కచ్చితంగా కామెడీ టైమింగ్ ఉంటే నన్ను పవన్ కళ్యాణ్ సజెస్ట్ చేస్తారు. అలాంటి కంటెంట్ ఉంటే ఖచ్చితంగా సినిమా ఉంటుంది. మేము ఎప్పటికీ స్నేహితులమే “అంటూ చెప్పుకోచ్చారు .

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news