Moviesపెళ్లయ్యాక ఆడవాళ్లు మొగడుతో అలా.. మరోసారి ఊరమాస్ పాయింట్ తో రవితేజ..!!

పెళ్లయ్యాక ఆడవాళ్లు మొగడుతో అలా.. మరోసారి ఊరమాస్ పాయింట్ తో రవితేజ..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ మహారాజ రవితేజకు ఎలాంటి పేరు ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎటువంటి హెల్ప్ లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చి తనదైన స్టైల్ లో సినిమాలు సెలెక్ట్ చేసుకుంటూ అసిస్టెంట్ డైరెక్టర్గా ఆ తర్వాత .. కమెడియన్ నుంచి స్టార్ హీరోగా ఎదిగిన రవితేజ అంటే ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు ఉంది . అంతేకాదు ఎలాంటి సినిమాలు చూస్ చేసుకున్న సరే .. జనాలను నవ్వించే ధీమ్ తో ఉంటాయి . కాగా రీసెంట్గా ఆయన నటించిన సినిమాలన్నీ వరుసగా డిజాస్టర్ గా మారుతున్న ఈ క్రమంలోనే ఆయన తన తదుపరి ఆశలను ధమాకా సినిమాపై పెట్టుకుని ఉన్నాడు .

అయితే ఓవైపు హీరోగా సినిమాలు చేస్తున్న.. మరో వైపు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ వైపు అడుగులు వేస్తున్నాడు. ఈ క్రమంలోనే రవితేజ టీం వర్క్స్ బ్యానర్ పై ఓ అద్భుతమైన సినిమా నిర్మిస్తున్నాడు . ఆ సినిమా కూడా మాస్ మహారాజా రవితేజ కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైన్ పరంగా జనాలకు నచ్చే విధంగా ఉంది అని రీసెంట్గా విడుదలైన ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది . తమిళ్ స్టార్ హీరో విష్ణు విశాల్ నటించిన గట్టికూస్తి అనే సినిమాను తెలుగులో మట్టి కుస్తీ అనే పేరుతో రిలీజ్ చేయబోతున్నారు.

కాగా రీసెంట్గా ఈ సినిమాకు సంబంధించిన తెలుగు ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ మొత్తం కామెడీ డైలాగ్స్ తో..వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య వచ్చే ప్రతి సీను చాలా క్లియర్ గా చూపించాడు డైరెక్టర్. ముఖ్యంగా ఈ సినిమాలోని డైలాగులకు జనాలు విపరీతంగా అట్రాక్ట్ అయ్యారు. ట్రైలర్ చివరలో చెప్పే..”ఎలాంటి ఆడదైనా పెళ్లయ్యాక మొగుడుతో కుస్తీ పట్టాల్సిందే ” అని హీరోయిన్ తో చెప్పే డైలాగ్ జనాలను విపరీతంగా ఆకట్టుకున్నింది. దీంతో ఈ సినిమా ఫుల్ లెంత్ కామెడీ మాస్ ఫ్యామిలీ ఎంటర్టైర్ గా ఉండబోతుంది అని.. రవితేజ ఖాతాలో బిగ్గెస్ట్ హిట్ పడిపోతుంది అని జనాలు చెప్పుకుంటున్నారు . ఏది ఏమైనా సరే హీరోగా టఫ్ కండిషన్ ఎదుర్కొంటున్న రవితేజ ..నిర్మాతగా సూపర్ సక్సెస్ అయ్యే ఛాన్స్ లు ఎక్కువగా ఉన్నాయి అంటున్నారు జనాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news